బుక్ మై షోలో డాకూ మ‌హారాజ్ విధ్వంసం… బాల‌య్య మాస్ దెబ్బకు బెంబేలు…!

నందమూరి నట సింహం బాలకృష్ణ హ్యాట్రిక్ సక్సెస్‌తో మంచి స్వింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మరో పక్క రాజకీయాలోను దూసుకుపోతున్న బాలయ్య.. అన్‌స్టాపబుల్‌షోతో ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేస్తూ.. ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే బాలయ్య నటించిన తాజా మూవీ డాకు మహారాజ్.. సంక్రాంతి బరిలో రిలీజ్‌కు సిద్ధమవుతుంది. బాలయ్య నుంచి ఒక సినిమా వస్తుందంటే.. ఆడియన్స్‌లో ఏ రేంజ్‌లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది.. సంక్రాంతి బరిలో బాలయ్య సినిమా అంటే కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఫ్యాన్స్‌తో పాటు.. సాధారణ ప్రేక్షకుల్లోనూ ఉంటుంది.

Daku Maharaj 💥🔥 #nandamuribalakrishna @director.bobby @nagavamsi19  @sitharaentertainments @fortune4cinemas @musicthaman #dakumaharaj  #dakumaharajteaser #balakrishna #newmovie #newpost #tollywood  #tollywoodactress #trending #movies #newpost #photoshop ...

ఈ క్రమంలోనే యంగ్ డైరెక్టర్ కొల్లి దర్శకత్వంలో మోస్ట్ ఎవైటెడ్‌.. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఆడియన్స్‌ను పలకరించనుంది డాకు మహారాజ్. తాజాగా వచ్చిన ట్రైలర్‌కు కాస్త నెగెటివిటీ వచ్చినా.. సినిమా విషయంలో మాత్రం ఆడియన్స్‌లో అంచనాలు తగ్గలేదు. ఈ క్రమంలోనే నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఎంతోమంది డాకు మహారాజ్ రిలీజ్ ఎప్పుడు ఎప్పుడా అంటూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాపై ఆడియన్స్‌లో, హీరోయిన్స్‌లో ఏ రేంజ్‌లో ఇంట్రెస్ట్ ఉందో క్లియర్గా తెలుస్తోంది.

ప్రముఖ ఆన్లైన్ బుకింగ్ యాప్ బుక్ మైషోలో డాకూ మ‌హారాజ్ విధ్వంసం సృష్టించింది. డాకు మహారాజ్ పట్ల ఏకంగా 2 లక్షలకు పైగా ఇంట్రెస్ట్ లు నమోదవడం విశేషం. దీంతో ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతలా ఎదురుచూస్తున్నారో అర్థమవుతుంది. ఇక సినిమాకు థ‌మన్‌ సంగీతం అందిస్తుండగా.. ప్రగ్యజైశ్వల్‌, చాందిని చౌదరి కీలకపాత్రలో కనిపించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల‌పై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక సంక్రాంతి బ‌రిలో జనవరి 12న రిలీజ్ కానున్న ఈ సినిమా ఆడియన్స్‌ను ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.