సినీ ఇండస్ట్రీలో గత కొనేళ్ళుగా మల్టీ స్టారర్‌ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఆర్‌ఆర్ఆర్ సినిమా ఎలాంటి సంచలన సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్.. మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఈ సినిమా తర్వాత మరిన్ని క్రేజీ మల్టీ స్టారర్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇలాంటి క్రమంలో రామ్‌చరణ్.. తాజాగా గేమ్ ఛేంజర్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. బాలయ్యా అన్‌స్టాపబుల్ సీజన్ 4లో రామ్ చరణ్ సందడి చేశారు.
ఇందులో భాగంగానే బాలయ్య, చరణ్‌ను మరో మల్టీస్టారర్ పై ప్రశ్న అడిగారని.. దానికి చరణ్ ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పాడంటూ న్యూస్ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. ఇంతకీ గ్లోబల్ స్టార్‌ను బాలయ్య అడిగిన ఆ ప్రశ్న ఏంటో.. దానికి చరణ్ ఎలాంటి సమాధానం చెప్పారో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో రామ్ చరణ్‌తో పాటు.. ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే మహేష్ బాబు పాన్ వరల్డ్ రేంజ్‌లో స్టార్ హీరోగా సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే బాలయ్య సూపర్ స్టార్ మహేష్ బాబు, పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇద్దరిలో ఎవరితో మల్టి స్టారర్ సినిమా చేస్తావు అంటూ చరణ్‌ను ప్రశ్నించారట.
దానికి చారణ్ రియాక్ట్ అవుతూ తాను మహేష్‌తో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సమాధానం ఇచ్చాడట. దీని బట్టి మెగా సూపర్ కాంబోలో మల్టీస్టారర్ పరిస్థితి అనుకూలిస్తే సాధ్యమవుతుందనటంలో సందేహం లేదు. ఇక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌లో ఎవరైనా వీరిద్దరి కాంబోలో సినిమా కోసం కథను సిద్ధం చేసుకుంటే బాగుండని వీరి కాంబోలో నిజంగానే సినిమా వస్తే సినిమా బ్లాక్ బస్టర్ కాయమంటూ ఇద్దరు హీరోల అభిమానులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక బాలయ్య ఇదే షోలో చరణ్‌ను మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రేజీ ప్రశ్నలు అడిగారని.. చరణ్ కూడా వాటికి తెలివిగా సమాధానం చెప్పాడంటూ టాక్ వైరల్‌గా మారింది. ఇక జనవరి 8న ఈ పూర్తి ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కానుంది.