అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్లో రూపొందుతున్న తండేల్ మూవీకి చందుమొండేటి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. గీత ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్ ప్రొడ్యూసర్‌గా రూపొందుతున్న ఈ సినిమా శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల జీవన నేపథ్యంలో సాగే ప్రేమ కథగా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమా 2024 డిసెంబర్లో రిలీజ్ చేస్తారని అంత భావించారు. కానీ.. అది జరగలేదు. 2025 సంక్రాంతికి వస్తుందేమో అనుకున్నా అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు తాజాగా ఫిబ్రవరి 7న సినిమా రిలీజ్ కానుంది అంటూ ప్రచారం వైరల్ గా మారుతుంది. పక్కాగా సినిమా రిలీజ్ డేట్ అదేనంటూ యూనిట్ వర్గాలు కూడా వెల్లడిస్తున్నాయి.
కానీ.. ఇప్పటికీ సినిమాకు సంబంధించిన వర్క్ మొత్తం పూర్తి కాలేదని సమాచారం. ఈ సినిమాకు సీజీ వర్క్‌లు కాస్త ఎక్కువగానే ఉన్నాయని.. సముద్రం మీద ఎపిసోడ్లు, పాకిస్తాన్ ఎపిసోడ్లు వర్క్ జరుగుతుందని.. భారీ జాతర సాంగ్ ఉండనుందని సమాచారం. ఇవన్నీ కలిపి సిజీ పనులు మరింతగా పెంచేసాయట. పైగా ఇవన్నీ క్వాలిటీగా రావాలంటే అందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సమయానికి కేటాయించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే వారికి మరింత సమయం పడుతుందని అంటున్నారు. అంతేకాదు నాగచైతన్య కెరీర్‌లోనే ఒకింత భారీ బడ్జెట్‌తో గీత ఆర్ట్స్ 2 బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతుంది.
ఈ సబ్జెక్టును ప్రొడ్యూసర్ బన్నీవాస్ విపరీతంగా నమ్ముతున్నారు. ఎలాగైనా సినిమా సక్సెస్ సాధిస్తుందని నమ్మకంతోనే ఎక్కడ రాజీ పడకుండా సినిమాలు రూపొందిస్తున్నారు. అవుట్‌పుట్ దగ్గర కూడా అసలు తగ్గకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఈసారి రిలీజ్ విషయంలోను ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకూడదని ఫిక్స్ అయ్యారట. అదే టైంలో క్వాలిటీ విషయంలోను ఎలాంటి ఇబ్బందులు రాకూడదని మేకర్స్ కు వివరించారట. ఇక ఈ రెండు సరైన సమయంలో పూర్తవుతాయా.. లేదా.. అనే టెన్షన్ మూవీ యూనిట్ మొత్తంలోనే ఉంది. డే అండ్ నైట్ వర్క్స్ చేస్తే మాత్రం ఫిబ్రవరి 7 నాటికి సినిమా పని అంతా పూర్తయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి చివరకు ఏం జరుగుతుందో వేచి చూడాలి.