సీనియర్ హీరోల్లో ఒకరైన సురేష్.. 80స్‌లో క్రేజీ హీరోగా దూసుకుపోయిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనేర్స్‌తో పాటు.. యూత్ ఫుల్ మూవీస్ లోనూ నటించి ఆకట్టుకున్న ఆయన.. అప్పట్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇటీవల కాలంలో సినిమాల్లో పెద్దగా నటించకపోయినా.. పలు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సురేష్.. 80లో హీరోలతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నామని.. మాకంటూ స్పెషల్ వాట్సాప్ గ్రూప్ ఉందంటూ వెల్లడించాడు. ఇక ఆయన హీరోగా కొనసాగుతున్న క్రమంలో నదియాతో ఎక్కువగా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.
ఆ టైంలో అతనితో నదియాకు లింక్ పెడుతూ ఎన్నో వార్తలు వచ్చేవని.. కానీ నదియాతో ఉన్న రిలేషన్‌షిప్ ఇదేనంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తను నాకు మంచి స్నేహితురాలని.. ఇంకా చెప్పాలంటే ఓ సోదరులాంటిది అంటూ చెప్పుకొచ్చాడు. ఎక్కువ సినిమాలు కలిసి చేయడంతో ఇద్దరి మధ్యన ఏదో ఉందని వార్తలు రాసేసారని.. నదియా బాయ్ ఫ్రెండ్ పేరు కూడా శిరీష్.. అతని పేరు శిరీష, నా పేరు సురేష్ అలా రెండు పేర్లు దగ్గరగా ఉండడంతో తను బాయ్ ఫ్రెండ్‌తో శిరీష్ అని మాట్లాడితే.. సురేష్ అనుకుని అది నేనే అనుకుని మాట్లాడుకునే వారంటూ వెల్లడించాడు. నదియా ఆ తర్వాత శిరీష్ ను పెళ్లాడిందని.. ఇప్పటికి నదియాతో మంచి రిలేషన్ ఉందంటూ సురేష్ చెప్పుకొచ్చాడు.
కేవలం నటుడు గానే కాదు.. డైరెక్టర్గా, ప్రొడ్యూసర్‌గా ఎన్నో సినిమాలు చేసిన ఆయన.. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కొన్నేళ్ళుగా తెరపై కనిపించడం మానేసిన సురేష్.. తిరిగి రీఎంట్రీ ఇవ్వాలని ఉందని తగిన అవకాశాలు వచ్చినప్పుడు నటిస్తానంటూ చెప్పుకొచ్చాడు. ఇక తన సినీ కెరియర్ లో 250కి పైగా సినిమాల్లో నటించిన ఆయన.. తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లోనూ ఆకట్టుకున్నాడు. 80లో హీరోల్లో సురేష్ కూడా అప్పటి ప్రేక్షకులను ఓ రేంజ్ లో మెప్పించాడు. ఈ క్రమంలోనే ఆయనకు మంచి అవకాశాలు వస్తే మరోసారి తన నటనతో సత్తా చాటుకుంటాడంటూ నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.