పుష్ప 3 లేదు.. ఏం లేదు.. సుకుమార్ పై బన్నీ ఫైర్.. అల్లు స్టూడియోస్ లో రచ్చ..

తాజాగా రిలీజ్ అయిన పుష్ప 2 ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఉన్న హైయెస్ట్ కలెక్షన్స్ టాలీవుడ్ సినిమాల రికార్డులు అన్నిటిని బ్లాస్ట్ చేసి నెంబర్ వన్ గా నిలిచి ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. ఔకాన్ స్టార్‌గా అల్లు అర్జున్‌కు తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా తర్వాత జరిగిన కొన్ని వ్యవహారాలతో పుష్ప సినిమా విషయంలో పెద్ద రచ్చ జరిగింది. అల్లు అర్జున్ సినిమా కోసం ఎంతగా కష్టపడ్డాడు.. ఐదేళ్ల నుంచి మరో సినిమా చేయకుండా ఎంతలా సినిమాపై దృష్టి పెట్టాడు. సినిమా చూసే ఆడియన్స్‌కు అర్థమైపోతుంది. ఇక డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ సినిమా కోసం తన కెరీర్ ని పణంగా పెట్టాడు. ఇప్పటి వరకు తన కెరీర్‌లో లేనంత సమయాన్ని ఈ సినిమా కోసం పెట్టి కష్టపడ్డాడు.

Pushpa 3: Allu Arjun To Start Filming After 6 Years? Shooting Details Out |  Report - News18

సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత సుకుమార్ కు కూడా పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ క్రియేట్ అయింది. అయితే అల్లు అర్జున్ మాత్రం సినిమా హిట్ అయిన ఏ మాత్రం హ్యాపీగా లేరు. తెలంగాణ ప్రభుత్వం.. బన్నీపై కేస్ వేసి అరెస్ట్ చేయ‌డం, బెయిల్ తెచ్చుకోవడం, కోర్టుకు వెళ్లడం, వీప‌రీత‌మైన ట్రోల్స్‌ ఇవన్నీ పుష్ప కారణంగానే జరిగాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్.. పుష్ప విషయంలో చాలా కోపంగా ఉన్నాడట. ఇక ఇప్పటికే రెండు పార్ట్‌లుగా వచ్చిన ఈ సినిమా మూడో పార్ట్ కూడా వస్తుందని చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 సినిమా రిలీజ్ తర్వాత బన్నీ గడ్డం గాని, జుట్టుగానే కట్ చేయకపోవడంతో పార్ట్ 3 షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ.. అల్లు అర్జున్ సడన్‌గా తన లుక్‌ను మార్చేశాడు. పూర్తిగా గడ్డం, జుట్టు కట్ చేసి నాయా లుక్‌లోకి వచ్చేసాడు.

అయితే దీని వెనుక పెద్ద కథ నడిచింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిందని మిగిలిన కొంత పార్ట్‌ అయితే.. సినిమాను కంప్లీట్ చేసి రిలీజ్ చేయొచ్చని సుకుమార్ భావించాడట. దీని కోసమే బన్నీని రిక్వెస్ట్ చేశాడట. బన్నీ స్క్రీన్ ప్రజెంట్ పుష్ప 3లో చాలా తక్కువ ఉంటుందని ఆయన వివరించాడట. కానీ.. అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలతో కోపంలో ఉన్న బన్నీ.. సుకుమార్ బిహేవియర్‌ని కూడా చూసుకొని తను సినిమా చేయడం లేదని పుష్ప 3 ఇక లేదంటూ.. దయచేసి తనని ఫోర్స్‌ చేయవద్దని తెగేసి చెప్పేసాడట. దీని గురించి మాట్లాడడానికి సుకుమార్, అల్లు అర్జున్.. అల్లు స్టూడియోస్లో కలిశారు. వాస్తవానికి పుష్ప పార్ట్ 2 రిజల్ట్ చూసిన తర్వాత పుష్ప 3 షూటింగ్ కూడా కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేయాలని భావించారు. కానీ.. తర్వాత పరిస్థితులు మారడంతో దాదాపుగా పక్కన పెట్టేసారు. సుకుమార్ కూడా మరో సినిమా లేకుండా ఖాళీగా ఉన్న క్రమంలో.. మూడో పార్ట్ పై బన్నీతో చర్చ జరిపారట. కానీ జరిగిన పరిణామాలతో చిరాకుగా ఉన్న బన్నీ.. పుష్ప సిరీస్ ను పూర్తిగా వదిలేశానని కామెంట్లు చేసినట్లు తెలుస్తుంది.