మా కోసం నువ్వు వచ్చావ్.. నీకోసం మేము వస్తాం.. జగన్ ఫోటోతో ” పుష్ప 2 ” ఫ్లెక్సీలు..

ప్రస్తుతం టాలీవుడ్‌లో మెగా వర్సెస్ అల్లు వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత ఆంధ్ర ఎలక్షన్ టైం లో అల్లు అర్జున్ చిన్న మామ అయిన పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేయకుండా.. వైసిపి అభ్యర్థి అయిన శిల్పా రవి కి సపోర్ట్ చేసినందుకు.. జన సైనికులతో పాటు మెగా అభిమానులు కూడా బాగా హర్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే మెగా, అల్లు అభిమానుల మధ్యను కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా వివాదాలు రాసుకున్నాయి. ఈ క్రమంలోనే బన్నీ పుష్పా 2 సినిమా పాన్‌ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను ఎలాగైనా ప్లాప్ చేస్తామంటూ మెగా ఫ్యాన్స్ ఓపెన్ కామెంట్స్ చేస్తున్నారు. జనసేన నేతలు.. పుష్ప 2ను అడ్డుకుంటామంటూ అల్లు అర్జున్ పై ఫైర్ అవుతున్నారు. అయితే ఈ వార్‌లో అల్లు అర్జున్‌కు అండగా వైసీపీ నిలుస్తుంది. ఏపీలో చాలా ప్రాంతాల్లో పుష్ప 2కి సపోర్ట్ గా వైసీపీ నేతలు తమ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి మద్దతు తెలుపుతున్నారు.

ఇందులో భాగంగానే అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో బన్నీతో పాటు.. మాజీ సీఎం జగన్ ఫోటోతో కూడిన భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి పుష్ప 2ను ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఆ ఫ్లెక్సీలో.. మా కోసం నువ్వు వ‌చ్చావ్‌.. మీ కోసం మేము వస్తాము.. తగ్గేదేలే అనే నినాదాలను హైలెట్ చేస్తూ నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. అయితే మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో పుష్ప 2 పోస్ట‌ర్‌లు ఎవ‌రో వ్యక్తులు చించి పడేసారు.