‘ పుష్ప 2 ‘ లో ఆ స్టార్ హీరోస్ గెస్ట్ అపీరియన్స్.. బొమ్మ బ్లాక్ బస్టర్ పక్కా.. }

పుష్ప 2 కనీ..వినీ.. ఎర‌గ‌ని రేంజ్‌లో హైప్‌ సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే పుష్ప సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్.. ఈ సినిమాతో ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు. ఈ క్రమంలోనే దీనికి సీక్వెల్ గా వ‌స్తున్న‌ పుష్ప 2పై ప్రేక్షకుల్లో పీక్స్ లెవెల్లో అంచనాలు ఉన్నాయి. ఇక‌ ఈ సినిమాతో మరోసారి బన్నీ పెను ప్రభంజనాన్ని సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో కేవలం తెలుగు ఆడియ‌న్స్‌లోనే కాదు పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకుల్లోనూ పుష్ప 2 పై ఆసక్తి నెలకొంది.

Peelings | Pushpa 2 song Peelings teaser: Rashmika Mandanna and Allu Arjun  to feature in dance number - Telegraph India

మరికొద్ది గంటల్లో ప్రీమియర్ షోస్ పడనున్న ఈ సినిమా టికెట్ల రేట్లు.. భారీగా ఉన్నా.. వెనకాడకుండా సినిమా టికెట్ దొరికితే చాలు అంటూ అభిమానులు వేచి చూస్తున్నారు. మేకర్స్ కూడా పుష్ప 2 అవుట్ పుట్‌ విషయంలో ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారని.. ఈ సినిమాతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి క్రమంలో ఈ సినిమాలో గెస్ట్ అపీరియన్స్ కోసం కొంతమంది స్టార్ హీరోలు కనిపించనున్నారని ఆడియ‌న్స్‌ను థ్రిల్ చేసేందుకు ఈ విషయాన్ని సుక్కు హైడ్ చేశాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Dulquer Salmaan says reimagining Soorarai Pottru remake into Sarfira is  'difficult'; talks about Akshay Kumar's performance | PINKVILLA

ఇంతకీ ఆ స్టార్ హీరోలు ఎవరో కాదు మ‌ళ‌యాళ‌ ఇండస్ట్రీకి చెందిన దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్, తమిళ్ స్టార్ హీరో సూర్య కనిపించనున్నారట. వారు ఏ సిట్యువేషన్ లో స్క్రీన్ పై కనిపిస్తారని విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ.. ఇదే వాస్తవం అయితే ఈ సినిమా రేంజ్‌ మరింతగా పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. ఇక మేకర్స్ అనుకున్నట్లుగానే ఈ సినిమా భారీ సక్సెస్ సాధిస్తే.. బన్నీ కెరీర్‌లోనే ది బెస్ట్ మూవీ గా ఈ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రిజల్ట్ వస్తుందో వేచి చూడాలి.

Actor Surya