‘ పుష్ప 2 ‘ టికెట్ రేట్ల‌పై రాంగోపాల్ వర్మ రియాక్షన్ .. ఇంతకీ తిట్టాడా, పొగిడాడా..?

పుష్ప 2 ఫీవర్ కొనసాగుతున్న క్రమంలో.. మరో పక్కన భారీ టికెట్ ధరల పెంపుపై పలుచోట్ల మేకర్స్‌కు విమర్శలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. టికెట్ ధరలు నియంత్రించాలంటూ ప‌లువురు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. ఈ క్రమంలో కాంట్ర‌వ‌ర్సీ డైరెక్టర్ ఆర్జీవి చేసిన ట్విట్‌ వైరల్ గా మారుతుంది. పుష్పా 2 టికెట్లను స్టార్ హోటల్ ఇడ్లీలతో పోల్చిన ఆయన.. సుబ్బారావు అనే ఒకడు హోటల్ పెట్టి ప్లేట్ ఇడ్లీ ధరలు రూ.1000గా ఫిక్స్ చేశాడు. అంత ధర పెట్టడానికి కారణం వాడి ఇడ్లీ.. మిగతా వాటికంటే చాలా గొప్పవని ఫీలవుతున్నాడు. కానీ.. కస్టమర్‌కు ఇడ్లీ అంత వర్త్ అనిపించకపోతే వాడు అతని హోటల్‌కు వెళ్ళడు. దాంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప.. ఇంకెవరు కాదు.

Pushpa 2 advance booking: 1 million tickets, Rs 50 crore for Day 1 - India  Today

సుబ్బారావు ఇడ్లీ ధర సామాన్యులకు అందుబాటులో లేదని ఎవరైనా ఏడిస్తే.. 7 స్టార్ జ్ఞోట‌ల్ ఇడ్లీ సామాన్యుడు తిన‌లేక‌పోతున్నాడ‌ని ఎడ‌వ‌డం అంత వెర్రిత‌నం అవుతుంది. ఒకవేళ సెవెన్ స్టార్ హోటల్ లో యాంబియన్స్ కి మనం ధ‌ర‌ చెల్లిస్తున్నామని వాదిస్తే.. పుష్ప 2 విషయంలో ఆ క్వాలిటీ అనేదే మూవీ డెమొక్రటిక్ క్యాప‌ట‌లిజం అనేది.. క్లాస్ డిఫరెన్స్ మీద వర్తిస్తుంది. అన్ని ప్రోడక్ట్స్ లాగే.. సినిమాలు కూడా లాభాల కోసమే తెరకెక్కిస్తారు. అంతేకానీ.. ప్రజాసేవ కోసం కాదు. లగ్జ‌రీ లైఫ్, విలాస‌ భవనాలు, కార్లు, బ్రాండెడ్ బట్టల రేట్లపై ఏడవని ఏడుపులు.. సినిమా టికెట్ ధరలపై ఎందుకు ఏడుస్తారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Telangana HC junks plea to halt Allu Arjun's Pushpa-2 release

ఇల్లు, తిండి, దుస్తులు అవసరం.. అలా అయితే ఈ మూడు నిత్యావసర ధరల బ్రాండింగ్ ఉన్నప్పుడు ఆకాశాన్ని తాకుతుంటే ఆకాశం లాంటి పుష్ప 2 సినిమాకు ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువే. అలా అనుకోని వారు చూడడం మానేయొచ్చు. లేదా.. రేట్లు తగ్గాక చూసుకోవచ్చు కదా అంటూ కామెంట్స్ చేసాడు. ఇక సుబ్బారావు హోటల్ విషయానికి వస్తే.. అంత ఎక్కువ ధర పెట్టిన కూడా ఇడ్లీ ధర ఇప్పటికే వర్కౌట్ అయిపోయింది. దానికి ప్రూఫ్ ఏ హోటల్ లో కూడా కూర్చునే చోటు దొరకడం లేదు. అన్ని సీట్లు బుక్ అయిపోయాయి అంటూ షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆర్జీవి చేసిన కామెంట్స్ నెటింట వైరల్ గా మారడంతో.. ఇంతకీ బన్నీని ఆయ‌న తిట్టాడా, లేదా పొగిడాడు.. ప్లేట్ ఇడ్లీతో పుష్ప 2 సినిమాను పోలుస్తున్నాడు ఏంటి అంటూ సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు నెటిజన్స్.