టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 మరికొద్ది గంటల్లో ఆడియన్స్‌ను పలకరించనుంది. దాదాపు 3 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన పుష్ప ది రూజ్ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుందో తెలిసిందే. దానికి సిక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమాపై మొదటినుంచి మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌లో అంచనాలను పిక్స్ లెవెల్ కు తీసుకువెళ్లింది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను.. నటీనటులా రెమ్యునరేషన్‌ల గురించి తెలుసుకోవాలి అని ఎంతోమంది సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో పుష్పా ది రూల్ సినిమాకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బన్నీ, సుకుమార్ కాంబోలో వస్తున్న నాలుగో సినిమా పుష్ప 2. ఇక.. దీనికంటే ముందు వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన ఆర్య, ఆర్య 2, పుష్ప ది రైజ్ మూడు సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇక ఈ మూవీకి బన్నీ ఏకంగా రూ.300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నడట. ఇండియా హైయెస్ట్ రెమ్యునరేషన్ చార్జ్ చేసిన నటుడుగా నేషనల్ ఫోర్స్ మీడియా తన మ్యాగ్జైన్ లో అఫీషియల్ గా ప్రకటించింది. ఇక 2022లో పుష్ప 2 పనులు ప్రారంభమయ్యాయి. లుక్ టెస్ట్, సినిమాను ప్రకటించడం తర్వాత 20023 రెగ్యులర్ షూట్.. విశాఖ, బ్యాంకాక్, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో షూట్ చేశారు. 2024 నవంబర్లో సినిమా షూట్ పూర్తిచేసి మరి కొద్ది గంటల్లో రిలీజ్ చేస్తున్నారు.
ఇక మొదట పుష్ప ఒక్క సినిమాగానే తీద్దామని భావించారట సుకుమార్. స్క్రిప్ట్ ప్రకారం కొంత షూటింగ్ అయిన తర్వాత నిర్మాత చెర్రీ వచ్చి సినిమా ఎంతవరకు వచ్చింది అని అడగడంతో అప్పటికే మూడున్నర గంటల ఫుటేజ్ రావడంతో ఆయన సజెషన్ ప్రకారం సినిమాను రెండు పార్ట్‌లుగా తీయాలని ఎడిట్ చేసి పార్ట్ 1రిలీజ్ చేశారు. మూడేళ్ళ తర్వాత పుష్ప 2 రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ మూవీలో గంగమ్మ తల్లి జాతర.. సినిమాకు హైలెట్ కానుందని.. కేవలం ఈ ఒక్క సీక్వెస్ట్ కోసం రూ.60 కోట్లు ఖర్చు చేసి.. దాదాపు 30 రోజులపాటు షూట్ చేసినట్లు సమాచారం. సినిమాలో పుష్పరాజ్ భార్యగా నటిస్తున్న రష్మిక.. శ్రీవల్లి పాత్రలో కనిపించనుంది. పార్ట్ 1 కంటే పార్ట్ 2 లో తన రోల్ పవర్ ఫుల్‌గా ఉండబోతుందని.. ఆమె ఎన్నో సందర్భాల్లో వెల్లడించారు రష్మిక. ఈ సినిమా కోసం రూ.10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందట.
ఇక పార్ట్ 1 ఎండింగ్‌లో పోలీస్ ఆఫీసర్‌గా.. భన్వర్‌సింగ్ షేకావత్ పాత్రలో ఫాహద్ పాజిల్ కనిపించిన సంగతి తెలిసిందే. పుష్ప 2లో ఆయన కీలక పాత్ర పోషించునున్నారని.. ఫస్ట్ హాఫ్ తర్వాత ఆయన నటన గురించి అందరు మాట్లాడుకుంటారు అంటూ బన్నీ వివరించాడు. మూవీ స్పెషల్ సాంగ్‌లో శ్రీ లీల మెరిసింది. బన్నీతో కలిసి ఈ సాంగ్ స్టెప్స్ వేసిన శ్రీలీల.. ఈ సాంగ్ కోసం ఏకంగా రూ.2 కోట్లు తీసుకుందట. ఇక సాంగ్‌కు కొరియోగ్రాఫర్‌గా గణేష్ ఆచార్య వ్యవహరించాడు. రష్మిక, బన్నీ ఫీలింగ్స్ పాట ఇప్పటికే ఎలాంటి పాపులారిటి దక్కించుకొని తెలిసిందే. అన్ని భాషల్లో ఈ పాట పల్లవి మలయాళం లో ఉంది. మలయాళ ఫ్యాన్స్ పై ప్రేమతో బన్నీ ఈ విధంగా చేసినట్లు వెల్లడించాడు.
పుష్ప 1కు డైలాగ్ రైటర్ గా వ్యవహరించిన శ్రీకాంత్ విస్సా.. ఈ సినిమాకు కూడా పనిచేశాడు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటే ఇంటర్నేషనల్, పుష్ప అంటే ఫైర్ కాదు.. వైల్ ఫైర్.. ఈ డైలాగ్స్ ఏ రేంజ్ లో పాపులరిటీ దక్కించుకున్నాయో తెలిసిందే. ఇక సినిమా నడివి 3 గంటల 20 నిమిషాల 38 సెకండ్లు ఉండబోతుంది. సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ వైరల్ గా మారింది. అత్యధిక నడివి కలిగిన తెలుగు సినిమాల జాబితాలో ఈ మూవీ ప్లేస్ దక్కించుకుంది.