నందమూరి నటసింహం బాలకృష్ణకు ప్రస్తుతం శుభఘడియలు నడుస్తున్నాయి. ఓ పక్క సినిమాల్లో హ్యాట్రిక్ అందుకున్న బాలయ్య.. మరోపక్క రాజకీయాలోను హ్యాట్రిక్ సక్సస్‌తో దూసుకుపోతున్నాడు. అంతేకాదు డిజిటల్ ప్లాట్ ఫామ్‌లోకి అడుగుపెట్టి హోస్ట్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో కూడా నటసింహం మార్క్ సత్తా చాటాడు బాలయ్య. ప్రస్తుతం ఈ షో నాలుగో సీజన్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. దీనిలో ఇప్పటివరకు ఎంతోమంది సెలబ్రిటీస్ స్పెషల్ గెస్ట్‌గా హాజరై సందడి చేసిన సంగతి తెలిసిందే.
అంతే కాదు.. ఈ వారం స్పెషల్ గెస్ట్‌గా విక్టరీ వెంకటేష్ సందడి చేయనున్నాడు. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో నెటింట వైరల్‌గా మారుతుంది. అయితే.. తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 4కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా రన్ అవుతుంది. ఈ సీజన్‌కు కేవలం ఎనిమిది ఎపిసోడ్‌లే ఉండనున్నయట. అయితే ఈ ఫైనల్ ఎపిసోడ్‌లో స్పెషల్ గెస్ట్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రాబోతున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. త్వరలోనే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌తో ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అన్‌స్టాపబుల్ సీజన్ 4లో చరణ్ సందడి చేయనున్నాడని.. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన అన్ని పనులు పూర్తిచేసి నిర్వాహకులు సిద్ధం చేస్తారంటూ టాక్ నడుస్తుంది. త్వరలోనే ఈ షో షూట్ కూడా పూర్తి చేయనున్నారట. ఈ ఎపిసోడ్ తో అన్‌స్టాపబుల్ సీజన్ 4 ఎండ్ కానుందని సమాచారం. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ వైరల్‌గా మారడంతో.. అటు నందమూరి అభిమానులతో పాటు మెగాస్టార్ అభిమానుల్లో కూడా ఆసక్తి నెలకొంది. కాగా.. మరికొంతమంది మాత్రం.. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అపీరియన్స్ లేకుండానే సీజన్ పోర్ కూడా పూర్తి చేస్తున్నారంటూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.