టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సంధ్య థియేటర్ తొక్కిసులాట ఘటనలో వివాదం ఎదుర్కొంటున్నాడు. అంతేకాదు.. ఎన్నో ట్రోల్స్ కూడా చూడాల్సి వస్తుంది. ఇలాంటి క్రమంలో అల్లు అర్జున్ పరిస్థితికి కారణం ఆ అన్‌లక్కీ నెంబర్ అంటూ.. ఆ నెంబరే అల్లు అర్జున్ కెరీర్‌ను పట్టిపీడిస్తుందంటూ.. దాని కారణంగానే ఆయన ఇన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ న్యూస్ నెటింట వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ నెంబర్ ఏంటి.. దాని వెనకున స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం.
ఇండస్ట్రీలో కొంతోమంది సెంటిమెంట్లను నమ్ముతుంటారు. వాటినే ఫాలో అవుతూ ఉంటారు. అలా జరగబోతుంది.. ఇలా జరగబోతుందని.. జాతకాల గురించి పండితులు ముందుగానే హెచ్చరించిన మరికొంతమంది మాత్రం వాటిని అసలు పట్టించుకోరు. అయితే కొన్ని సందర్భాల్లో అది నమ్మి ఉంటే మంచి జరిగేదే అన్న పరిస్థితి నెలకొంటుంది. ప్రస్తుతం బన్నీ లైఫ్ లోను ఇదే జరిగింది. బన్నీ మొదటి నుంచి సెంటిమెంట్ చాలావరకు ఫాలో కాడు. అన్నిటిని లైట్ తీసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు అదే బన్నీకి పెద్ద నెగిటివ్గా మారిందంటున్నారు జనం.
ఇంతకీ పుష్పరాజ్‌ను పట్టిపీడిస్తున ఆన్‌లక్కి నెంబర్ ఏంటో చెప్పలేదు కదా.. అదే 11 నెంబర్. ఇప్పటివరకు ఆయన లైఫ్‌లో జరిగిన కొన్ని నెగటివ్ సంఘటన ఆధారంగా దీని గురించి చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే 11 నెంబర్ విషయంలో ప్రపంచం బన్నీకి ఏదో హింట్ ఇవ్వాలనుకుందని.. కానీ.. ఆయన దానిని అర్థం చేసుకునే ఉంటే బాగుండేదంటూ జ్యోతిష్యులు చెప్తున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే అల్లు అర్జున్ మే 11న మెగా ఫ్యామిలీని కాదని నంద్యాలకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ నుంచి ఆయన పతనం మొదలైంది.
అల్లు అర్జున్ వేసిన ఫస్ట్ రాంగ్ స్టెప్ అదే. తర్వాత సంధ్య థియేటర్ ఘటన ఈ ఇష్యూ జరిగింది కూడా 11 గంటలకే. అలాగే అల్లు అర్జున్ అరెస్ట్, బెయిల్ తర్వాత.. మరోసారి పోలీసులు.. అల్లు అర్జున్‌ను విచారణకు రమ్మన్న సమయం కూడా ఉదయం 11 గంటలకే కావడంతో.. అల్లు అర్జున్‌కు 11 అనే నెంబర్ పెద్ద సమస్యగా మారిపోయిందని.. ఇదే అన్ లక్కీ నెంబర్ పోతే గాని.. బన్నీ లైక్ మళ్ళీ రీసెట్ కాదు అంటూ చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.