టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా దేవరతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొడితే కుంభస్థలం కొట్టాలన్నట్టుగా మంచి ఫామ్ లో దూసుకుపోతున్నాడు తారక్. కంటెంట్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూనే వరుస కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. అలా ప్రస్తుతం వార్2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, తారక్ మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ సినిమాపై ఫోకస్ చేయనున్నాడు. ఈ క్రమంలోనే తారక్, ప్రశాంత్ నీల్ కాంబో ఇప్పటికే ఎన్నో పుకార్లు వినిపించాయి. ముఖ్యంగా ఏదో మైథాలజికల్ సబ్జెక్టు అంటూ.. తారక్ కోసం నీల్ సరికొత్తగా ట్రై చేయనున్నాడంటూ వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చాడు ప్రశాంత్. కథ మైథాలజికల్ స్టోరీ కాదని.. పిరియాడికల్ సినిమా అంటూ వెల్లడించాడు.
ఇక వచ్చేది ఫిబ్రవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రానుందట. కాగా ప్రశాంత్ గత సినిమాలు కేజిఎఫ్, సలార్‌లో ఖన్సార్ తరహాలో ఇందులో కూడా ఒక కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాడని క్లారిటి వచ్చింది. అంతేకాదు యూరప్‌లో బ్లాక్ సీ దగ్గర ఎన్టీఆర్ 31 షూటింగ్ ప్లాన్ జరుగుతుందని.. ఈ సినిమాలో తారక్ ఇప్పటివరకు చూడని ఊర మాస్ గెటప్‌లో వైల్డ్‌గా కనిపించనున్నట్లు తెలుస్తుంది. రుక్మిణి వసంత్ ఇందులో హీరోయిన్ గా కనిపించబోతుందని టాక్.