బాలయ్య ” డాకు మహారాజ్ రన్ టైం లాక్ “.. మొత్తం ఎన్ని గంటలంటే..?

గాడ్ ఆఫ్ మాసేస్ బాలకృష్ణ తాజా మూవీ డాకు మహారాజ్. వాల్తేరు వీరయ్య ఫేమ్‌ బాబి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాల్లో ప్ర‌గ్య‌జైశ్వల్‌ హీరోయిన్ గా నటించగా.. శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి కీలకపాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ నటుడు బాబి డియోల్ వ‌ల‌న్ పాత్రలో మెప్పించనున్నాడు. ఇక‌ ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలను నెలకొన్నాయి. కాగా వచ్చేయడాది సంక్రాంతి బరిలో జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతున్న క్రమంలో.. సినిమా ప్రమోషన్స్‌లో జోరు పెంచారు మేకర్స్.

తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే సినిమా ట్రైలర్ ఎప్పుడు వస్తుందో అంటూ ఆశ‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. తాజాగా డాకు మహారాజ్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసిన నాగ‌ వంశీ సినిమా ట్రైలర్ జనవరి 2న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు. ఇలాంటి క్రమంలో సినిమా రన్ టైం పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారుతుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డాకు మహారాజు ఫైనల్ రన్ టైం మేకర్స్ లాక్ చేశారట.

Daku Maharaj Run Time Revealed?"

ఈ సినిమాకు 2 గంటల 24 నిమిషాల్లో ఫైనల్ కట్ పూర్తయిందని. టైటిల్ క్రెడిట్, హెల్త్ వార్నింగ్ మెసేజ్‌లన్నిటినీ కలుపుకొని సినిమా 2 గంటల 40 నిమిషాలు ఉండబోతుందని తెలుస్తుంది. అయితే ఈ విషయంపై మేకర్స్ ఇప్పటి వరకు అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వలేదు. కాగా.. బాలయ్య ఈ సినిమాల్లో డబల్ షేడ్స్‌లో సరికొత్త లుక్స్ లో కనిపించనున్నాడు. ఈ క్రమంలోనే సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇక.. సినిమా రిలీజ్ అయిన తర్వాత డాకు మహారాజా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో.. బాలయ్య మరో హ్యాట్రిక్‌కు నాంది పలుకుతాడో.. లేదో.. వేచి చూడాలి.