తెలంగాణ సీఎం టాలీవుడ్ సినీ ప్రముఖులు కలిసిన సంగతి తెలిసిందే. భేటీ ముగిసిన తర్వాత ఎఫ్‌డీసి చైర్మన్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ తెలంగాణ సినీ చరిత్రలో అభివృద్ధితో పాటు.. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లమంటూ వెల్లడించాడు. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి ఇండస్ట్రీకి అండగా ఎప్పుడు ప్రభుత్వం ఉంటుందని సీఎం హామీ ఇచ్చారని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.
గంజాయి, డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం మన హీరోలు, హీరోయిన్లు తమ వంతు పాటు పడాలని సిఎం కండిషన్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వంతో కలిసి ఇండస్ట్రీ సెలబ్రెటీస్ పాటుపడతారని దిల్‌రాజు వెల్లడించాడు. ఐటి, ఫార్మా తో సమానంగా సినీ పరిశ్రమ కూడా ప్రభుత్వానికి ముఖ్యమంటూ సీఎం చెప్పారని ఆయన వెల్లడించాడు. హైదరాబాద్ హాలీవుడ్ సినిమాలో నిర్మించే స్టేజ్ కు ఎదగడానికి పాటుపడాలని సీఎం చెప్పినట్లు దిల్ రాజు వివరించాడు. తెలంగాణలో సామాజిక అంశాలలో ఇకపై సెలబ్రిటీస్ కూడా పాల్గొననున్నారని దిల్ రాజు వివరించాడు.
సినిమా టికెట్ల రేట్లు పెంపు, బెనిఫిట్ షోలు లాంటి అంశాలు చాలా చిన్నవని ఆయన అన్నాడు. ఇక రేవంత్ రెడ్డితో తమ సమావేశం చాలా సానుకూలంగా జరిగిందని చెప్పిన దిల్ రాజు.. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఇండస్ట్రీ పని చేస్తుందంటూ చెప్పుకొచ్చాడు. కొన్ని సంఘటన కారణంగా సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగింది అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని.. త్వరలో మేమంతా కలిసి ఓ మీటింగ్ ఏర్పాటు చేసుకొని సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి పాటుపడాల్సిన అంశాలను.. కావల్సిన అవపరాలను సిఎం దృష్టికి తీసుకువెళ్తామని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దిల్ రాజు చేసిన కామెంట్స్ నెటింట వైరల్ గా మారుతున్నాయి.