టాలీవుడ్ ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం కోసం సినీ ప్రముఖులు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో తాజాగా భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితం వీరి మీటింగ్ జరిగింది. ఇక ఈ భేటిలో సినీ పరిశ్రమను ప్రోత్సహించడమే తన ముఖ్య ఉద్దేశమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించాడు. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి తన ప్రభుత్వం సహకరిస్తుందని భరోసానిచ్చారు. ఇక తెలంగాణ అభివృద్ధిలో సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలంటూ ముఖ్యమంత్రి సినీ పెద్దలకు వెల్లడించాడు. భంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సినీ ప్రముఖులు సీఎంతో సమావేశమయ్యారు. ఈ భేటీకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డిజిపి జితేందర్ తదితరులు పాల్గొన్నారు.
సంధ్య థియేటర్ తొక్కిసులాట ఘటన అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ సినీ ప్రముఖుల మీటింగ్‌కు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. సమావేశం ప్రారంభంలో సంధ్య థియేటర్ తో సంబంధించిన వీడియోని సినీ పెద్దల ఎదుట సీఎం ప్రదర్శించాడు. అనంతరం పలువురు సినీ పెద్దలు తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రితో షేర్ చేసుకున్నారు. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఖరిని వాళ్లకు తెలియజెప్పాడు. ప్రభుత్వం ఇండస్ట్రీతోనే ఉందని శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదంటూ వివరించాడు. ఫ్యాన్స్‌ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలకే ఉంటుందని.. తెలంగాణ అభివృద్ధిలో పరిశ్రమ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలంటూ చెప్పుకొచ్చాడు.
డ్రగ్స్, గంజాయి నియంత్రణ పై అవగాహన మహిళ భద్రతపై ప్రచారంలో సినీ ప్రముఖులు చొరవ చూపించాలని.. ఆలయ పర్యటన ఎక్కువ టూరిజం ప్రచారం చేయాల్సి ఉంటుందని.. ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఇండస్ట్రీ సహకరించాలని.. ఇకపై బౌన్సర్‌ల విషయంలో సీరియస్ గా ఉంటామని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పాడు. సినీ పరిశ్రమ సమస్యలు.. ప్రముఖులు మా దృష్టికి తీసుకువచ్చారు. అనుమానాలు, అపోహలు, ఆలోచనలు షేర్ చేసుకున్నారు. మా ప్రభుత్వం ఇండస్ట్రీకి ఎల్లప్పుడు తోడుగా ఉంటుంది. సినీ పరిశ్రమలు ప్రోత్సహించడమే మా లక్ష్యం. ఎనిమిది సినిమాలకు మా ప్రభుత్వం స్పెషల్ జీవాలు ఇచ్చింది.
పుష్ప సినిమాకు ఇబ్బంది కలగకూడదని పోలీస్ గ్రౌండ్ కూడా ఇచ్చాం. తెలుగు ఇండస్ట్రీకి ఒక బ్రాండ్ సృష్టించాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. ఐటీ ఫార్మా తో పాటు మాకు సినీ రంగం కూడా ముఖ్యమే. ఇప్పటివరకు తెలుగు పరిశ్రమకు ఏం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వ చేసింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అదే వారసత్వాన్ని కొనసాగిస్తుంది. తెలుగు పరిశ్రమ కేవలం తెలుగుకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందాలి దానికి మేము ప్రోత్సహిస్తాం. అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని సినీ ప్రముఖులకు భరోసా ఇస్తున్నమంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వైదికగా షేర్ చేసుకున్నాడు.