ప్రస్తుతం ఇండియా లెవెల్లో అల్లు అర్జున్ అరెస్ట్ దుమ్మారం రేపింది. సంధ్య థియేటర్ తొకిసలాట ఘటన,
రేవతి అనే మహిళ మృతి చెందటం.. ఆమె కొడుకు శ్రీ తేజ ఆసుపత్రి పాలవడం.. బన్నీ నిర్లక్ష్యమే కారణమంటూ అల్లు అర్జున్‌ను ఆరెస్ట్ చేశారు. ఆయన బెయిల్, రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా బన్నీపై ఫైర్ అవ్వడం, తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్, వెంటనే పోలీసులు ప్రూఫ్‌లతో సహా వీడియోలు రిలీజ్ చేస్తూ పెట్టిన ప్రెస్మీట్ నెటింట హాట్ టాపిక్‌గా ట్రెండ్ అయ్యాయి. వీటిలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి.. అల్లు అర్జున్ పై చేసిన కామెంట్స్ తెగ వైరల్ గా మారాయి. రేవతి మరణించడంతోపాటు.. అతని కుమారుడు శ్రీ తేజ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.
ఈ విషయంపై కనీసం సినీ ఇండస్ట్రీలో ఏ ఒక్కరు స్పందించలేదు. అంతేకాదు ఎవరు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా వెళ్లలేదు. కానీ.. అరెస్ట్ అయిన అల్లు అర్జున్‌ను పరామర్శించడానికి మాత్రం పొలోమంటూ వెళ్ళిపోయారు. ఇకపై ఇండస్ట్రీలో ఒక బెనిఫిట్‌షో కానీ.. టికెట్ రేట్ల పెంపు కానీ ఉండదు అంటూ తేల్చి చెప్పేసాడు. దీంతో.. రోజురోజుకు ఇండస్ట్రీ, తెలంగాణ ప్రభుత్వం మధ్యన వార్ ముదిరిపోతుందంటూ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు 46 మంది సినీ ప్రముఖులతో అటు సీఎం రేవంత్ రెడ్డితో చర్చించేందుకు భేటీ ఏర్పాటు చేశాడు.
ఇక ఈ మీటింగ్ లో సెలబ్రిటీలకు తన విషయాలు తెలియజేయడమే కాదు.. ఇండస్ట్రీకి తాను కొన్ని కండిషన్లు కూడా విధించాడు. ప్రతి ఒక్కరు సమాజం పట్ల జాగ్రత్త వహించాలని.. ప్రజల పట్ల గౌరవంగా ఉండాలంటూ చెప్పుకొచ్చిన ఆయన.. మాదకద్రవ్యాలలాంటి వాటిని అరికట్టేందుకు ఇండస్ట్రీ ప్రోత్సహించాలని చెప్పుకొచ్చాడు. అయితే ఇలాంటి క్రమంలోనే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ గురించి ప్రస్తావించారు. అల్లు అర్జున్ పై నాకెందుకు కోపం అంటూ ప్రస్తావించిన ఆయన. బన్నీ నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. తనతో కలిసి తిరిగే వాడిని. వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా చట్టప్రకారం వ్యవహరించాల్సిందే.. అది నా విధానం అంటూ రేవంత్ రెడ్డి సినీ పెద్దలతో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి.. అల్లు అర్జున్ పై చేసిన కామెంట్స్ మరోసారి వైరల్ గా మారుతున్నాయి.