టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ డాకు మహారాజ్ సంక్రాంతి బరిలో దిగనున్న సంగతి తెలిసిందే. ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్గా.. శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై.. సూర్యదేవరన నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న ఆడియన్స్ ముందుకు రానున్న ఈ సినిమా.. ప్రమోషన్స్ ఇప్పటికే జోరుగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బాబి ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశాడు. సినిమాకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు.
ఇక డాకు మహరాజ్ సినిమా గురించి ఆయన రియాక్ట్ అవుతూ.. బాలకృష్ణని ఇప్పటివరకు చూడని విధంగా ఈ సినిమాల్లో చూస్తారంటూ వెల్లడించాడు. సెట్లో ఆయన ఎనర్జీ అన్ స్టాపబుల్ అంటూ చెప్పుకొచ్చిన బాబి.. బాలయ్య గురించి మాట్లాడుతూ సినిమాల్లో.. ఒక్క సన్నివేశంలో కూడా డూప్ ను ఉపయోగించలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఎంత కష్టమైనా సీన్ అయినా బాలయ్య తానే స్వయంగా చేస్తానని మరి చేశారని.. ఆయన దృష్టిలో పెట్టుకునే ఈ సినిమా కథ రాసుకున్న అంటూ చెప్పుకొచ్చాడు. ఇక గేమ్ ఛేంజర్‌కు ఈ సినిమా పోటీ కాదని.. సంక్రాంతికి రెండు, మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం కామన్.. ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయంటూ చెప్పుకొచ్చాడు.
యానిమల్ సినిమా రిలీజ్ కంటే ముందే బాబీ డియోల్ ఈ సినిమా గురించి వివరించాలని.. బాలకృష్ణ పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. ఆయన పాత్రకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుందంటూ బాబి చెప్పుకొచ్చాడు. ఇక బాబి డియోల్ తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడని చెప్పిన బాబి.. చిరంజీవి, బాలయ్యలతో తన ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతూ బాలయ్య, చిరంజీవిని చూసి తను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని వెల్లడించాడు. ఇక బాలయ్య డైరెక్టర్ ఏది చెప్తే అదే వింటారని వెల్లడించాడు.
జనవరి 4న డల్లాస్ లో డాకు మహారాజ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భారీగా చేస్తున్నట్లు వివరించాడు. టికెట్లు ధర విషయంలోను దిల్ రాజు ఒక పరిష్కారం చూపిస్తారని నమ్ముతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరం.. ఒక ఫ్యామిలీలో తల్లి చనిపోవడం అంటే అది చాలా బాధాకరం.. అలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు పడాలంటూ బాబి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బాబీ డాకు మహారాజ్‌లో ఒక డూప్లి కూడా వాడలేదంటూ చేసిన కామెంట్స్ నెటింట వైరల్ గా మారుతున్నాయి.