తారక్ – నెల్సన్ ఫిక్స్‌… ఆ నిర్మాత మొత్తం బ‌య‌ట పెట్టాడుగా..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా ఓటీటీ టాప్ 10 స్ట్రీమింగ్ తెలుగు సినిమాలలో ఒకటిగా నిలిచి గ్లోబ‌ల్ లెవెల్‌లో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇలాంటి క్రమంలో ప్రస్తుతం ఎన్టీఆర్ కథలను ఆచితూచి ఎంచుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం.. ఎన్టీఆర్ బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్‌తో కలిసి.. మల్టీస్టారర్ మూవీ వార్ 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ పూర్తయిన వెంటనే.. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌తో మరో సినిమాలో నటించనున్నారు. ఇలాంటి క్రమంలో ఎన్టీఆర్.. డైరెక్టర్ నెల్సన్ కాంబోలో సినిమా రాబోతుందంటూ ఓ వార్త వైరల్ అవుతుంది.

NTR gearing up to kickstart action for War 2 from this time | cinejosh.com

ఈ క్రమంలోనే.. తాజాగా సినిమాకు సంబంధించి ఎన్నో రకాల రూమర్లు వైరల్ గా మారుతున్నాయి. ఇక‌ వీరిద్దరి కాంబోపై.. తాజాగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ లో ఒకరైన నాగవంశీ రియాక్ట్ అయ్యారు. తాను ఇంటర్వ్యూలో ఈ కాంబోపై మాట్లాడుతూ.. క్లారిటీ ఇచ్చాడు. నెల్సన్, ఎన్టీఆర్ గారి సినిమా కథపై ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని.. కేవలం ఎన్టీఆర్ గారితో సినిమా చేయాలని నెల్సన్, మేము ఓ మాట అనుకున్నామని చెప్పుకొచ్చాడు. హీరో గారితో.. నెల్సన్ కి ఓ మీటింగ్ మాత్రమే అయ్యిందని.. ఆయన వెల్లడించాడు. ప్రస్తుతం నిల్స‌న్‌ ఆ కథను పూర్తి చేస్తున్నారని.. వార్ 2 సినిమా అయిపోయాక.. ఎన్టీఆర్‌కి కథను వినిపిస్తారని వివ‌రించాడు.

Lucky Baskhar producer Naga Vamsi's comments on star heroes faces massive  backlash

కథ నచ్చితే షూటింగ్ గురించి, సినిమాలు ఎలా లాంచ్ చేయాలి.. ఏ రేంజ్ లో ప్లాన్ చేయాలనే.. అంశాల గురించి ఆలోచిస్తామంటూ నాగ వంశీ క్లారిటీ ఇచ్చేసాడు. ఇక డైరెక్టర్ నెల్స‌న్‌ ఇప్పటికే తమిళ్లో బీస్ట్, జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించి తనకంటూ స్టార్ట్ డైరెక్టర్గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్, నెల్సన్ కాంబోలో ఓ సినిమా వ‌స్తే మాత్రం ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్ అంచనాలు ఉంటాయి అనడంలో సందేహం లేదు. ఇక.. ఈ కాంబినేషన్ అయితే కచ్చితంగా సెట్స్‌పైకి వస్తుందన్న క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్‌. అయితే ఇంతకీ ఎప్పుడు ఈ కాంబో సెట్స్ పైకి వస్తుందనే అంశాలు మాత్రం తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.