సంక్రాంతి సీజన్ అంటేనే టాలీవుడ్ సినిమాలకు పెద్ద పండుగ అనడంలో అతిశయోక్తి లేదు. సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయిన దాదాపు అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలుస్తాయి. ఈ క్రమంలోనే సంక్రాంతికి తమ సినిమాను రిలీజ్ చేయాలని చిన్న హీరోల నుంచి స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ల వరకు అంత ఆరాటపడుతూ ఉంటారు. ఇక.. అందరు ఎదురుచూసే సంక్రాంతి సీజన్ రానే వచ్చింది. ఇంకో 11 రోజుల్లో గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి బరిలో రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత.. రెండు రోజుల గ్యాప్ లో బాలయ్య డాకు మహారాజ్.. మరో రెండు రోజుల గ్యాప్ తో వెంకటేష్ సంక్రాంతి వస్తున్నాం.. సినిమాలు కూడా రిలీజ్ అవుతాయి.
కాగా ఈ సినిమాలకు తెలంగాణ షోలు ఎప్పుడు మొదలవుతాయి.. టికెట్ ధరలు ఎలా ఉండబోతున్నాయి.. అని సస్పెన్స్ మాత్రం ఇప్పటికి వీడలేదు. నెలకిందటి వరకు ఎలాంటి అయోమయం లేకుండా.. అడిగిందే తడువుగా తెలంగాణ ప్రభుత్వం.. మొదటి వారం అదన షోలు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు ఇచ్చేస్తూ వచ్చింది. కానీ.. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగిన సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనుమతులు ఉండవని ప్రభుత్వం తేల్చి చెప్పేసింది.
సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడుగా ఉన్న దిల్ రాజు ఈ విషయంపై రాయబారం నడిపి.. తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు సర్ది చెప్పి అనుమతులు ఇప్పిస్తారని అంతా భావించారు. కానీ.. ఇటీవల జరిగిన రేవంత్ రెడ్డి సినీ పెద్దల మీటింగ్లో అసలు టికెట్ రేట్ల వ్యవహారంపై చర్చే రాలేదు. అసలు ఈ విషయంపై ప్రస్తావించలేని పరిస్థితి నెలకొంది. మీటింగ్ తర్వాత మీడియా దీనిపై దిల్ రాజును అడిగినా.. ఇది చాలా చిన్న విషయం అంటూ సమాధానాన్ని దాటేసాడు. ఏదేమైనా ఇలాంటి క్రమంలో దిల్ రాజుకు.. తన సినిమాలకు అదనపు షోల టికెట్ రేట్లు చాలా అవసరం. ఆయన ప్రొడ్యూస్ చేసిన గేమ్ ఛేంజర్, సంక్రాంతి వస్తున్నాం రెండు సినిమాలు ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ కారున్నాయి.
ఇక డాకు మహారాజ్‌కు నైజాంలో డిస్ట్రిబ్యూటర్ కూడా దిల్‌రాజే కావడంతో ఈ సినిమాలపై భారీ పెట్టుబడులు పెట్టి ఉన్న రాజుగారు.. టికెట్ రేట్ల పెంపు లేకుండా గట్టెక్కడం కాస్త కష్టమే.. ఓవైపు ఆంధ్రలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఆయన.. అదనపు షోలు, టికెట్ల రేట్ల పై స్పెషల్ పర్మిషన్లు తెచ్చుకోనున్నాడు. కానీ.. తెలంగాణ పరిస్థితి ఏంటి అనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. దిల్ రాజుకు తెలంగాణ గవర్నమెంట్ పెద్దలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఒకవేళ ఆయన కోసం ప్రభుత్వం వెనక్కి తగ్గచ్చేమో అనుకుంటే.. అసెంబ్లీలో సీఎం, మీడియం ముందు మంత్రి గట్టిగా ప్రకటన చేశాక.. వెనక్కు తగ్గితే అది ప్రభుత్వానికే సమస్య కావచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో సంక్రాంతి సినిమాలకు నైజం లో అదనపు షోలు వస్తాయా, రేట్లు పెంచుతారా లేదా.. అనేది సస్పెన్స్ గా మారింది. సస్పెన్స్ వీడాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.