టాలీవుడ్ క్రేజీ డైరెక్టరలలో ఒకరిగా హరీష్‌శంకర్ తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. కమర్షియల్ సినిమాలను మాత్రమే తెరకెక్కించి బాక్స్ ఆఫీస్ దగ్గర.. ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ సాధించిన హరీష్.. దాదాపు ఆయన నుంచి తెరకెక్కిన అన్ని సినిమాలతోనూ మంచి టాక్ తెచ్చుకున్నాడు. అయితే హరీష్ శంకర్ నుంచి చివరిగా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ మాత్రం రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు క్రియేట్ చేసినా.. రిలీజ్ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర డీలపడింది.
దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలోని హరీష్ నుంచి నెక్స్ట్ రాబోయే సినిమాపై ప్రభావం పడింది. ఇక టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పటినుంచో సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. తమిళ్ మూవీ తేరే కి రీమేక్ గా రూపొందుతుంది. ఈ క్రమంలోని హరీష్ శంకర్‌కు అసలైన టెన్షన్ మొదలైంది. ఈ సినిమా ఇప్పటికే తెలుగులో పోలీసోడు టైటిల్ తో రిలీజ్ అయింది. ఇక రీసెంట్గా బేబీ జాన్ గా హిందీలోనూ తెరకెక్కింది.
అయితే బాలీవుడ్ లో ఏ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు పవన్ కోసం.. హరీష్ శంకర్ ఎలాంటి మార్పులు చేయబోతున్నాడు.. ఈ సినిమా తెలుగు ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందా.. లేదా.. ఎలాంటి రిజల్ట్ అందుకుంటుంది.. కమర్షియల్ హంగులు అద్దుతున్నాడా.. ఆడియన్స్ మెప్పించగలడా.. అనే అంశాలు ఇంట్రెస్టింగ్ గా మారాయి. మరి హరీష్ శంకర్.. ఈ టెన్షన్ అన్నింటిని ఎలా హ్యాండిల్ చేస్తాడో వేచి చూడాలి.