డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ.. థియేటర్లలో బాలయ్య శివతాండవమే..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ తాజా మూవీ డాకు మహారాజ్‌తో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో ప్రమోషన్స్ లో జోరు పెంచారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా విషయంలో ప్రెస్ మీట్ పెట్టు మరీ ప్రొడ్యూసర్ నాగ వంశీ, డైరెక్టర్ బాబి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. అంతేకాదు.. సంక్రాంతికి మ్యాన్ ఆఫ్ మాసేస్ బాలయ్య నుంచి ఆ సినిమా వస్తే.. అది కచ్చితంగా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ కూడా ఉంది.

డాకు మహారాజ్‌గా రాబోతున్న బాలయ్య! NBK109 టైటిల్ కన్ఫార్మ్ అయ్యేది అప్పుడే... | Times Now Telugu

ఈ సెంటిమెంట్ డాకు మహారాజ్‌కు కూడా కచ్చితంగా వర్కౌట్ అవ్వబోతుందని నాగ వంశి చేసిన కామెంట్స్ బట్టి క్లారిటీ వచ్చేసింది. బాల‌య్య‌ హీరోగా.. బాబి కొల్లి, కే.ఎస్.రవీంద్ర డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా జనవరి 12న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. విడుదలకు 10 రోజుల ముందే.. మ్యూజిక్ డైరెక్టర్ థ‌మన్ తన వర్క్ పూర్తి చేసి దర్శక , నిర్మాతలకు పూర్తి సినిమాను చూపించారు.

ఇక దానిపై నాగ వంశి సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతూ.. డాకు మహారాజ్ స్కోర్ ఇప్పుడే చూసా.. ఒక్కటే ఒక మాట.. సూపర్.. థియేటర్లలో బ్లాస్టే వేరే లెవెల్ అనే రేంజ్ లో ఫైర్ బ్లాస్టింగ్ ఎమోజీలకు షేర్ చేసుకున్నాడు నాగ వంశీ. ఇక థియేటర్లలో బాలయ్య శివతాండవమే అమ్మ.. అంటూ నాగవంశీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారుతుంది. కాగా నాగ వంశీ చెప్పిన రేంజ్ లో థ‌మన్ బ్లాక్ బస్టర్ స్కోర్ ఇచ్చాడా.. సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకొనుంది.. ఎలాంటి రిజల్ట్ అందుకుంటుంది.. తెలియాలంటే ఫస్ట్ షో రిజల్ట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.