టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తాజా మూవీ పుష్ప 2 బాక్స్ ఆఫీస్ దగ్గర సంచల రికార్డులు క్రియేట్ చేస్తూ కలెక్షన్లతో దూసుకుపోతుంది. డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా స్టనింగ్ కలెక్షన్లతో అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ వట వీశంవరూపం చూపించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. బన్నీ నటనకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. పుష్పరాజ్ యాటిట్యూడ్, మేనరిజంకు ఆడియన్స్‌ను ఫిదా అవుతున్నారు.
ఇలాంటి క్రమంలోనే.. సినిమాకు సౌత్ తో పాటు.. నార్త్ ఆడియన్స్ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఇక పుష్ప 2 మరోసారి అరుదైన ఫీట్ సాధించింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య 70 ఎంఎం థియేటర్‌లో గత 23 ఏళ్లుగా ఉన్న రికార్డులు పుష్ప 2 బ్రేక్ చేసి పడేసింది. ఇంతకీ ఆ రికార్డు ఏంటో.. అసలు డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవర్‌గ్రీన్ క్లాసిక్ మూవీ.. ఖుషి పేరిట ఉన్న రూ.1.53 కోట్ల రికార్డును తాజాగా పుష్ప 2 బద్దలుకొట్టింది.
కేవలం 4 వారాల్లోనే పుష్ప 2 అక్కడ రూ.1.59 కోట్ల కలెక్షన్లను రాబట్టి రికార్డ్ సృష్టించింది. కాగా ఖుషి రిలీజ్ టైం టికెట్ రేట్లకు.. ఇప్పుడు పుష్ప 2 టికెట్ కాస్ట్‌లకు చాలా తేడా ఉందన్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో ఖుషి సినిమా రికార్డులను బ్రేక్ చేసి పుష్ప 2 సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక మునుముందు పుష్పరాజ్ మరిన్ని రికార్డులను బ్రేక్ చేస్తాడు.. ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడు.. చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.