నందమూరి నటసింహం బాలకృష్ణ.. భగవంత్ కేసరితో చివరిగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాలయ్య నుంచి ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఈ ఏడాది బాలయ్య నుంచి సినిమా రిలీజ్ కాకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహపడిన.. అన్‌స్టాపబుల్ షో తో ఫ్యాన్స్‌ను కాస్త ఎంటర్టైన్ చేశాడు బాలయ్య. ఇక 2025 సంక్రాంతి బరిలో బాలయ్య రంగంలోకి దిగనున్న సంగతి తెలిసిందే. డాకు మహారాజ్ గా ఆడియన్స్‌ను పలకరించనున్నాడు బాలయ్య. జనవరి 12న ఈ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నారు.
ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ప్రారంభించేసారు మేకర్స్. ఈ సినిమా గురించి అటు నిర్మాత నాగ వంశీ.. ఇటు డైరెక్టర్ బాబి ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంటున్నారు. వారి మాటల్లోనే సినిమా పై అంచనాలు మరింతగా పెంచేస్తున్నారు. డాకు మహారాజ్ ని ఇంతవరకు యాక్షన్ సినిమా గానే టీం ప్రమోట్ చేయగా.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సినిమాల్లో ట్విస్టులు, థ్రిల్లింగ్ సీన్‌లు పిక్స్ లెవెల్ లో ఉండనున్నాయని.. సినిమా మొత్తం మీద ఏకంగా మూడు ట్రిస్టులు ఉంటాయని.. అవన్నీ కథని ఎప్పటికప్పుడు కొత్త కోణంలో మలుపు తిప్పుతాయని సమాచారం.
ఈ సినిమాలో పాప క్యారెక్టర్ కు ఎంతో ప్రాధాన్యత ఉందని తెలుస్తుంది. ఇంతకీ ఆ పాప ఎవరు అనే అంశం అందరిలోనూ ఆసక్తి రేపుతుంది. ఇంతకీ ఆ పాప ఎవరన్నా విషయాన్ని రివిల్ చేయడమే సినిమాలో అతిపెద్ద ట్విస్ట్ అట. బాలయ్య రోల్ భిన్నమైన కోణాలు ఒక్కొక్కటిగా తీసుకురావడం.. ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తుందని సమాచారం. ఇక ఇప్పటికే సినిమా నుంచి రెండు పాటలు రిలీజ్ కాగా.. మూడో పాట జనవరి 4న రిలీజ్ చేయనున్నారు. ఈ పాట మాస్‌కు బాగా నచ్చేలా ఉండనుందని.. ఇందులో బాలయ్య స్టెప్స్ కొత్త తరహాలో మెప్పించనున్నాయట. రెండు పాటల్లో బాలయ్య ఎనర్జీ చూసే అవకాశం రాకున్నా.. మూడో సాంగ్ లో ఫ్యాన్స్ కు ఆ లోటు కూడా తీరబోతుందని తెలుస్తోంది.