టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్గా అడుగుపెట్టి ఒక సరైన సక్సెస్ అందితే చాలు.. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ఆరాటపడుతూ ఉంటారు డైరెక్టర్స్. అలాంటి వారిలో అనిల్ రావిపూడి కూడా ఒకరు. మెగాస్టార్ చిరంజీవితో పనిచేయడానికి ఆయన ఎప్పటినుంచో ఆశక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడుగా ఎన్నోసార్లు చిరుని కలిసాడు అనిల్ రావిపూడి. కానీ.. స్క్రిప్ట్ మాత్రం లాక్ కాలేదు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో సినిమా ఫిక్స్ అయినా వీరిద్దరూ ఎలాంటి సినిమా చేయబోతున్నారనేది మాత్రం సీక్రెట్ గానే ఉంది.
ఇక వీరిద్దరి కాంబోలో తెరకెక్కనున్న సినిమాకు ప్రొడ్యూసర్ గా తానే వ్యవహరిస్తానని షైన్ స్క్రీన్స్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ సినిమాలో ఎలాంటి మెసేజ్ ఉండకుండా.. సినిమా ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేస్తుందని.. యాక్షన్ అంశంతో కూడిన అవుట్ అండ్ అవుట్ టైలర్ గా సినిమా రూపొందనుందని వెల్లడించాడు.
మేమంతా చిరు గారి సినిమాలు చూస్తూ ఆయన ట్రేడ్ మార్క్ ఎలిమెంట్స్ ని ఎంజాయ్ చేస్తూ పెరిగామని చెప్పుకొచ్చిన ఆయన.. మెగాస్టార్ నటించబోయే ఈ సినిమాలో అనిల్ రావిపూడి సిగ్నేచర్ కామెడీ తప్పకుండా ఉంటుందని.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్‌ను మెప్పించడం ఖాయం అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం చిరు విశ్వంభర పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే.. శ్రీకాంత్ ఓదెల, మోహన్ రాజతో మరో సినిమా లైన్ లో ఉంది. ఈ ప్రాజెక్టును కూడా పూర్తి చేసిన తర్వాత చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమాలో నటించే అవకాశం ఉంది.