ఇండస్ట్రీలో ఓ కాంబో తరికెక్కి బ్లాక్ బస్టర్ అయిన తర్వాత.. మరోసారి ఆ కాంబినేషన్ రిపీట్ అవుతుందంటే ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొంటాయి. ఆదోరకమైన క్రేజ్ ఏర్పడుతుంది. అలా 2025లో ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్ అంచనాలు తెచ్చే కాంబోలు చాలా వరకు రిపీట్ కానున్నాయి. అందులో ఏకంగా తెలుగులోనే ఐదు కాంబినేషన్స్ తెరకెక్కనున్నాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం.
రామ్ చరణ్ – సుకుమార్:
వీళ్ళిద్దరి కాంబోలో గతంలో రంగస్థలం రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. నాన్ థియేటర్లు బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి ఈ బ్లాక్ బస్టర్ కాంబో 2025 సెకండ్ హాఫ్‌ల రిపీట్ కానుంది.
బాలకృష్ణ – బోయపాటి:
నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు రిలీజై.. మూడు బ్లాక్ బస్టర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి 2025 లో ఈ కాంబో రిపీట్ కానుంది. అఖండ 2 తాండవం టైటిల్‌తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్ అంచనాలు ఉన్నాయి.
అల్లు అర్జున్ – త్రివిక్రమ్:
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు రిలీజై మూడు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి వీరు ఇద్దరు కాంబోలో భారీ పాన్ ఇండియన్ మైథాలజికల్ మూవీ రానుంది. ఈ సినిమా 2025లో సెట్స్ పైకి రానున్నట్లు సమాచారం. ఏకంగా రూ.400 కోట్ల బడ్జెట్లో ఈ సినిమాను రూపొందించనున్నారట.
పూరి జగన్నాథ్ – గోపీచంద్:
వీళ్ళిద్దరి కూడా బ్లాక్ బస్టర్ కాంబో. గతంలో వీళ్ళిద్దరి కాంబోలో గోలీమార్ సినిమా రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే 2025లో వీరిద్దరూ కాలర్ రిపీట్ కాని ఉందని సమాచారం.
నిఖిల్ – చందు మొండేటి:
గతంలో వీళ్ళిద్దరి కాంబోలో కార్తికేయ, కార్తికేయ 2 సినిమాలు తెరకెక్కి మంచి సక్సెస్ అందుకున్నాయి. ఈ క్రమంలోనే వీరి కాంబోలో మరోసారి సినిమాకు ఫ్రీక్వెల్ గా కార్తికేయ 3 తెరకెక్కనుందని.. 2025లో ఇది సెట్స్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇవే కాదు మరిన్ని బ్లాక్ బస్టర్ కాంబోలో 2025లో రిపీట్ కానున్నాయి.