గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు పవన్.. డిప్యూటీ సీఎం అంచనాలను పెంచేస్తాడా..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – శంకర్ కాంబోలో తెరకెక్కనున్న తాజా మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో.. మేకర్స్‌ సినిమా ప్రమోషన్స్ లో మరింత జోరు పెంచారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా గేమ్ ఛేంజ‌ర్ మ్యానియా కొనసాగుతుంది. ఓ వైపు సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో మేకర్స్ బిజీగా ఉంటూనే.. మరో పక్క సినిమాకు సంబంధించి వరుస అప్డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలను భారీ లెవెల్ లో పెంచేస్తున్నారు. సోషల్ మీడియాలో సందడి చేస్తూ అన్ని కోణాల నుంచి సినిమాను పరుగులు పెట్టిస్తున్నాడు ప్రొడ్యూసర్ దిల్ రాజు.

Game Changer (2025) - Movie | Reviews, Cast & Release Date in hyderabad-  BookMyShow

రోజు రోజుకి ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మరింతగా పెంచేస్తున్నారు. అయితే ఇంత ప్రచారం నడుస్తున్న చిన్న క్లారిటీ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే పవన్ కళ్యాణ్ ఎంట్రీ. ఈ మూవీ ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్‌లో పవన్ వస్తాడని ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో గేమ్ ఛేంజ‌ర్‌ ప్రచారానికి పవన్ వస్తారా.. లేదా.. అనేది ఆడియన్స్ ఆసక్తిని కల్పిస్తుంది. పవన్ వస్తే సినిమాకు వచ్చే బజ్‌ వేరే లెవెల్ లో ఉంటుందన్నటంలో అతిశయోక్తి లేదు.

ఇవాళ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు కీలక సమావేశం

అయితే.. ఎట్టకేలకు దీనిపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చేసాడు. పవన్ కోసం తాను వెయిట్ చేస్తున్నట్లు వివరించాడు. పవన్ కళ్యాణ్ డేట్ ఇస్తే జనవరి 4 లేదా 5న ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఈవెంట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన భారీ కటౌట్‌ విజయవాడలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇక పవన్ కూడా డేట్ ఇస్తే సినిమా ప్రచారం పిక్స్ లెవెల్ లో ఉంటుంది. ఈ సినిమా ప్రచారానికి బాబాయ్ ని రప్పించేందుకు చరణ్ చాలా ప్రయత్నిస్తున్నాడట. పవన్ ప్రమోషన్స్ కు రావడం ఖాయం. ఇక డేట్ తేలప‌డమే ఆలస్యం అంటూ సమాచారం.