యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వి కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన పాన్ ఇండియన్ మూవీ దేవర. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది. అయితే రిలీజ్ అయిన ప్రతి చోట మొదట నెగిటివ్ టాక్ వచ్చినా.. తర్వాత మెల్లమెల్లగా పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు పరంగాను పుంజుకుంది. దసరా కానుకగా రిలీజైన ఈ సినిమా భారీ
కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సినిమాలో ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్, నటన, డ్యాన్స్ ప్రేక్షకులను మెప్పించాయి.
ఇక దేవర సక్సెస్ కావడంతో ఫ్యాన్స్ కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్ దేవర డిజిటల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇక ఓటీటీలో కూడా దేవర సినిమా రికార్డ్ సృష్టించిందని సమాచారం. ఓటీటీ టాప్ ట్రైడింగ్ సినిమాలలో.. దేవర సినిమా కూడా ఒకటి కావడం విశేషం. నాన్ ఇంగ్లీష్ టాప్ 10 సినిమాలలో 4వ స్థానంలో గ్లోబల్ లెవెల్లో దేవర చోటు దక్కించుకుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే దేవర 2పై ఒక్కసారిగా ఆడియన్స్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి.
ఇక ఇప్పటికే మూవీ టీంస్క్రిప్ట్ లో మొదలుపెట్టారని.. దేవర సినిమా గ్లోబల్ స్థాయిలో ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవ్వడంతో.. సినిమా సీక్వెల్ విషయంలో మేకర్స్ మరింత జాగ్రత్త తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోని తారక్ కెరీర్‌లో దేవర ఎప్పటికీ గుర్తుండిపోతుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. రాజమౌళితో సినిమా తర్వాత నటించిన సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం.. ఆ బ్యాడ్ సెంటిమెంటును తారక్ బ్రేక్ చేయడంతో ఈ సినిమా సక్సెస్ ఫ్యాన్స్ లో మరింత ఆనందాన్ని పెంచింది. ఇలాంటి క్రమంలో దేవర క్రియేట్ చేసిన తాజా రికార్డ్ నెట్టింట వైరల్ గా మారుతుంది.