సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. అల్లు అర్జున్ వివాదంపై ఎట్టకేలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. ఈ కేస్‌పై ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ బాధిత కుటుంబం ఇంటికి.. ఎవరో ఒకళ్ళు వెళ్లి ఆ రెండో రోజే మాట్లాడి తోడు ఉన్నామని ధైర్యం చెప్పి ఉంటే ఎంత ఇష్యూ జరిగేది కాదంటూ కామెంట్ చేశారు. బాధిత కుటుంబాన్ని వెంటనే పరామర్శించాల్సిందని.. ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. గోటితో పోయే వివాదాన్ని గొడ్డలి దాకా తెచ్చారని వెల్లడించాడు.
అభిమాని మృతి చెందిన వెంటనే ఇంటికి వెళ్లి పరామర్శించకపోవడంతో మానవతా దృక్పథం లోపించినట్లయిందని.. బన్నీ కాకున్న ఆయన టీం అయినా రియాక్ట్ అవ్వాల్సిందంటూ చెప్పుకొచ్చాడు. ఇక సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఆయన మాట్లాడుతూ.. కేవలం రేవంత్ పేరు చెప్పలేదని అరెస్ట్ చేశారు అనడం సరికాదని.. బన్ని స్థానంలో ఎవరు ఉన్నా రేవంత్ అలాగే చేసేవాళ్లంటూ చెప్పుకొచ్చాడు. ఇక సినిమా పై అయినా రియాక్ట్వుతూ సమాజంపై ప్రభావం చూపేలా సినిమా ఎందుకు ఉండకూడదు అనిపిస్తుందని.. సినిమాకు సంబంధించిన కొన్ని ఎడిట్స్ జరగాల్సి ఉందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. తెలంగాణ ప్రభుత్వం చాలా గౌరవప్రదంగా, మర్యాదపూర్వకంగా సినిమాతో వ్యవహరించిందని అయిన వివరించాడు.
ఇక ప్రతి హీరో తమ సినిమా కు ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో.. ప్రజలు ఎలా స్పందిస్తున్నారు తెలుసుకోవాలని అనుకుంటారని.. అల్లు అర్జున్ అంశంలో ముందస్తు ఏర్పాట్లు మరింతగా జరిగి ఉంటే బాగుండేదంటూ.. అభిప్రాయాలు వ్యక్తం చేశాడు. ఎవరైనా అల్లు అర్జున్ స్టాఫ్ కానీ.. సినిమా హాల్ వాళ్లు కానీ.. ముందుగా చెప్పి ఉండాల్సిందని.. పవన్ పేర్కొన్నాడు. ఇక మనం ఎంత ప్రముఖులమైనా న్యాయం అందరికీ సమానంగా ఉంటుందని చెప్పిన పవన్.. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఏం చేసినా రెండు వైపులా పదునున్న కత్తిలా ఆయన పరిస్థితి మారిపోయిందంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పవన్ కామెంట్స్ నెటింటా వైరల్ గా మారుతున్నాయి.