టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా నటించిన తాజా మూవీ పుష్ప 2 ఏ రేంజ్‌లో సక్సెస్ అందుకుందో తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొడుతూ రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇక ఈ సినిమాలో కిసిక్ అంటూ స్పెషల్ సాంగ్‌లో శ్రీ లీల మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్‌లో బన్నీ, శ్రీలీల స్టెప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌తో కలిసి పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు కూడా తెగ వైరల్ గా మారుతుంది.
ఇంతకీ ఆమె ఎవరో చెప్పలేదు కదా. కొరియోగ్రాఫర్ గా కిసిక్ పాటకు వ్యవహరించిన గణేష్ ఆచార్య మాస్టర్‌తో కలిసి పని చేసింది. ఇక ఈ ముద్దుగుమ్మ అసలు పేరు ఊర్వసి అప్సర. ఈ పాటకు కొరియోగ్రఫీ చేస్తున్న క్రమంలో అల్లు అర్జున్‌తో కలిసి ఊర్వశి స్టెప్స్ వేసిన వీడియో నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. కేవలం పుష్ప పార్ట్ 2 స్పెషల్ సాంగ్‌కి మాత్రమే కాదు.. పుష్ప పార్ట్ వన్ లో సమంత ఉ అంటావా మామా ఊఊ అంటావా సాంగ్కు కూడా ఊర్వశినే కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించిందని సమాచారం.
ఈ క్రమంలోనే అమ్మడు కొరియోగ్రాఫ్ చేసిన రెండు సాంగ్స్ విపరీతమైన సక్సెస్ అందుకోవడంతో.. అమ్మడితో కలిసి పనిచేస్తే సినిమా రిజల్ట్ అదిరిపోతుందంటూ.. సినిమా బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే ఊర్వశి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ నేటిజెన్లను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు బన్నీతో స్టెప్స్ వేసి పోస్ట్ చేసిన వీడియో.. ఒక్కసారిగా అమ్మడికి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.