స్టార్ బ్యూటీ మీనాక్షి చౌదరి ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది రిలీజ్ అయిన లక్కీ భాస్కర్, ది గోట్ సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్లు తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇదే ఏడాదిలో సక్సెస్‌లు మాత్రమే కాదు రెండు దారుణమైన వరుస డిజాస్టర్లు కూడా ఎదుర్కొంది. అవే మట్కా, మెకానిక్ రాకీ. ఈ రెండు సినిమాల్లో అతిపెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. అయితే ఓ హీరోయిన్ కు వరుసగా రెండు డిజాస్టర్ వస్తే ఆమెను ఐరన్ లెగ్ అంటూ ఇండస్ట్రీకి దూరం చేసేస్తూ ఉంటారు సినిమా జనాలు.
ఈ క్రమంలోనే మెల్లగా అవకాశాలు కూడా తగ్గిపోతాయి. కానీ.. మీనాక్షి విషయంలో నిజంగానే మ్యాజిక్ జరిగింది అనడంలో అతిశయోక్తి లేదు. వరస డిజాస్టర్ ఎదుర్కొన్న తర్వాత కూడా.. ఈమెకు క్రేజీ ఆఫర్ లు క్యూ కడుతున్నాయి. అయితే ఆమెకు వరస సినిమా ఆఫర్లు రావడం వెనుక ఓ కుర్ర హీరో ఉన్నాడంటూ న్యూస్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. మీనాక్షి చౌదరికి ఆ యంగ్ హీరోతో ఉన్న ఎఫైర్ వల్లే ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయని రూమర్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అలా ఇప్పటికే స్టార్ హీరో వెంకటేష్ నటించిన.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో జనవరి 14న ఆడియన్స్ ను పలకరించడానికి సిద్ధమవుతుంది.
అంతే కాదు రీసెంట్ గా నవీన్ పోలీశెట్టితో అనగనగా ఒక రాజు సినిమాలో హీరోయిన్ కూడా అవకాశాన్ని కొట్టేసింది. దీన్ని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. మొదట ఈ సినిమాలో శ్రీలీలను హీరోయిన్గా అనుకున్నా ఆమె తప్పుకోవడంతో ఆ ఛాన్స్ మీనాక్షి కొట్టేసింది. అంతేకాదు.. చిరు విశ్వంభర సినిమాలోను మీనాక్షి హీరోయిన్గా కనిపించనుంది. ఇలా.. వరుస సినిమాల్లో ప్రేక్షకులకు మెప్పించడానికి సిద్ధమవుతున్న ఈ ముద్దుగుమ్మ ఆఫర్ల మ్యాజిక్ వెనుక యంగ్ హీరో రికమండేషన్ ఏ ప్రధాన కారణం అట. ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ న్యూస్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది.