లోకనాయకుడు కమలహాసన్ కూతురిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్‌గా ఇమేజ్ క్రియట్ చేసుకున్న శృతిహాసన్‌కు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ తో పాటు, కోలీవుడ్ లోను పలు సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ.. తనకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇక సినిమాల కంటే ఎక్కువగా శృతిహాసన్ పర్సనల్ లైఫ్, లవ్ రూమర్స్ లాంటి వార్తలతోనే ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటుంది.
ప్రస్తుతం కూలి సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. తనకు దేవుడిపై నమ్మకం ఉన్నా.. తండ్రి కారణంగా తను గుడికి వెళ్లలేకపోయేదాని అంటూ చెప్పుకొచ్చింది. తన తండ్రి ఇంట్లో వాళ్ళని ఎవరిని దేవాలయాలకు వెళ్ళనిచ్చేవారు కాదని చెప్పుకొచ్చిన శృతిహాసన్.. తాను కమల్ హాసన్‌కు తెలియకుండానే చర్చ్‌కి వెళ్ళలేదని అంటూ చెప్పుకొచ్చింది. ఈ విషయం చాలా ఏళ్ల తర్వాత ఆయనకు తెలిసిందని వివరించింది.
ప్రస్తుతం తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం దేవుడిపై ఉన్న నమ్మకమే అంటూ వివరించిన ఈ ముద్దుగుమ్మ.. తనకు 18 ఏళ్ళు ఉన్నప్పుడే అమ్మ, నాన్న విడాకులు తీసుకున్నారని.. ఇది తనను డిప్రెస్ అయ్యేలా చేసిందని.. ఈ సంఘటన కారణంగానే నేను పూర్తిగా ముందుకు బానిపనైపోయానంటూ చెప్పుకొచ్చింది. అయితే తన ఆరోగ్యం చాలా క్షీణించింది అంటూ వార్తలు వినిపించాయని.. కానీ అందులో వాస్తవం లేదంటూ చెప్పుకొచ్చింది. అమ్మ, నాన్నల విడాకులు తన మనసును చాలా బాధ కలిగించాయని చెప్పిన శృతిహాసన్.. వాళ్ళ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. ఈ క్రమంలోనే మందుకు బానిసనయ్యా అంటూ చేసిన కామెంట్స్ నెటింట వైరల్ గా మారుతున్నాయి.