సినీ ఇండస్ట్రీలో మతాంతర, కులాంతర వివాహాలపై వాటి నుంచి ఎదుర్కొనే సమస్యలపై ఎన్నో కథలను సినిమాలుగా తెరకెక్కిస్తూనే ఉన్నారు. అంతేకాదు.. రియల్ లైఫ్ లోను ఇలాంటి కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రముఖులు.. మతంత్ర వివాహాలు చేసుకుంటున్నారు. కాని కొన్ని చోట్ల మాత్రం.. ఇప్పటికి కూడా మతాంతర వివాహాలు.. ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. అలాంటి సంఘటన.. స్టార్ హీరోయిన్ రెజీనా కసాండ్ర కుటుంబంలో కూడా జరిగిందట. కోలీవుడ్‌కు చెందిన ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్‌లో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, పిల్లా నువ్వు లేని జీవితం, సౌఖ్యం లాంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.
తెలుగులోనే కాదు.. తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ మెప్పించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న రెజీనా.. పలు సినిమాల్లో ఐటెం గర్ల్ గాని మెరిసింది. ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరుతో స్టెప్‌లు వేసింది. ఇక ఈ ముద్దుగుమ్మ పలు వెబ్ సిరీస్లలోను మెప్పించింది. ప్రస్తుతం హీరో అజిత్ నటించిన విడముయర్చి సినిమాలో కీలక పాత్రలో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఇలాంటి క్రమంలో రెజీనా ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. పుట్టినప్పుడు తాను ఇస్లాం మతస్తురాలనని.. ఆ తర్వాత క్రిస్టియన్ మతానికి మారానంటూ వెల్లడించింది.
ఆమె మాట్లాడుతూ తన తల్లి క్రిస్టియన్ మతానికి చెందిన అమ్మాయి. తండ్రి ఇస్లాం మతస్తుడంటూ వెల్లడించింది. ఇద్దరు ప్రేమించి వివాహం చేసుకోవడంతో.. ఆమె ఇస్లాం మతస్థురాలుగా జన్మించానని.. అలాగే పెరిగానని చెప్పుకొచ్చింది. అయితే తన ఆరేళ్ల వయసులో ఉండగా జరిగిన ఓ ఇన్సిడెంట్ కారణంగా మతంతో పాటు.. పేరు కూడా మార్చుకున్నాను అంటూ వెల్లడించింది. అదే అమ్మ, నాన్న విడిపోవడం అని.. దాంతో తన అమ్మగారు తిరిగి క్రిస్టియన్ గా కన్వర్ట్ అయ్యి రెజినాకు.. కసాండ్రా పేరు జత చేశారని.. దాంతో తాను బాప్తిజం పొంది బైబిల్ చదివాను అంటూ వెల్లడించింది. అలా ఆమె రెజీనా కసాండ్రాగా అందరికీ పరిచయమైందట. నిజానికి తన అసలు పేరు రెజీనా మాత్రమే నట. మతం విషయంలో తనకు ఎలాంటి పట్టింపులు ఉండవని చెప్పుకొచ్చిన రెజీనా.. చర్చి, మసీదు, గుడి ఇలా ఎక్కడికైనా వెళ్ళొస్తానంటూ షేర్ చేసుకుంది.