టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా తెలుగులో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్లు అందుకున్న వెంకీ తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓక్కింత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను.. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 14న రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో వెంకి మామ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.
అయితే చాలా విషయాల్లో ఇండస్ట్రీలో ఉండే ఇతర హీరోలకు వెంకటేష్ భిన్నంగా ఉంటారు. ఇక ఇటీవల వెంకటేష్ ఓ షోలో మాట్లాడుతూ అరుణాచలం ఆలయం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ప్రపంచం లో చాలా ప్రదేశాలు తిరిగానని.. ఈ క్రమంలో ఎంతమందిని కలిశానని చెప్పిన వెంకటేష్.. తన లైఫ్ లో కూడా ఎన్నో డిస్టర్బెన్స్ లు చూసానని వివరించాడు. ఇక చివరికి అరుణాచలం వెళ్లి స్వామి దర్శనం చేసుకున్న తర్వాత స్కందాశ్రమంలో మెడిటేషన్ చేసానని ఆయన పేర్కొన్నాడు.
అక్కడ ఏదో తెలియని శక్తి మనలో ప్రవేశిస్తుందని.. అసలైన హ్యూమన్ ఎనర్జీ అంటే ఏంటో అక్కడే తెలుస్తుంది అంటూ వెంకటేష్ ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు. నేను అలాంటి శక్తిని అక్కడ నుంచి పొందానని కామెంట్స్ చేశాడు. తర్వాత నా లైఫ్ లో ఎలాంటి సంఘటన కూడా నన్ను డిస్టర్బ్ చేయలేదని చెప్పిన వెంకటేష్.. ప్రస్తుతం నాలో మీరు చూస్తున్న మార్పులు అరుణాచలం దర్శనం తర్వాత వచ్చినదేనని ఆయన చెప్పుకొచ్చాడు. ఎక్కడ దొరకని ప్రశాంతత అరుణాచలంలో ఉంటుందని నేను నాది అనేది మర్చిపోయి.. ఏదీ శాశ్వతం కాదని తెలుసుకుంటామని వెంకటేష్ వివరించాడు. ఇక ఈ గుడి తమిళనాడులోని.. తిరువణమలై జిల్లాలో ఉంటుంది. జీవిత పరమార్ధాన్ని తెలుసుకోవాలని భావించే చాలామంది ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారట.