టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ కెరీర్ ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్‌గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక దశాబ్దాలుగా చిరంజీవిని ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రముఖులు, అభిమానులు బాస్ అని పిలుస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే. కాగా ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల క్రమంలో చిరంజీవి మాత్రమే ఇండస్ట్రీకి బాస్ అంటూ ఎన్నో కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.
ఇలాంటి క్రమంలో తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌లలో ఒకరైన దిల్ రాజు చేసిన కామెంట్స్ మరోసారి హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి. టాలీవుడ్‌కు ఒక్కడే బాస్.. మెగా బాస్.. అయనే మెగాస్టార్ చిరంజీవి అంటూ దిల్ రాజు వివరించాడు. గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించి 256 అడుగుల చరణ్ కటౌట్‌ను ప్రారంభించిన క్రమంలో ఆయన మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఇవి. కటౌట్ ప్రారంభించిన తర్వాత దిల్ రాజు మాట్లాడుతూ 45 ఏళ్ల నుంచి చిరంజీవి గారిని ఆదరించి.. సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ ప్రస్థానానికి కొనసాగించిన చిరంజీవి గారి ఫ్యాన్స్ మీరు. మామూలు అభిమానం కాదు.. పరిశ్రమలో ఆయన మహా వృక్షం.
కష్టపడి పైకి వచ్చిన మెగాస్టార్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా చాలా తక్కువే అవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా ఎంతోమందిని ఇండస్ట్రీకి అందించిన గొప్ప వ్యక్తి చిరంజీవి గారు. ఆయనకి తోడుగా ఉండి చరణ్ కు 256 అడుగుల ప్రపంచ రికార్డ్ సాధించే కటౌట్ స్థాపించి మీ అభిమానం అది ఎంతో గొప్ప విషయం.. అభినందనీయమైన విషయం అంటూ దిల్ రాజు మెగా ఫ్యాన్స్ ను పొగడ్తల వర్షం కురిపించాడు. ఇక కాదు గేమ్ చేజర్ కు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను దిల్‌రాజు ఈవెంట్ లో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం దిల్ రాజు మెగాస్టార్ ఉద్దేశించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి.