టాలీవుడ్ నాగార్జున హీరోగా.. శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్‌లో అనుష్క శెట్టి నటించిన మూవీ ఢమరుకం. 2012లో రిలీజ్ అయిన ఈ సినిమాలో అందకాసుర అనే పవర్ఫుల్ రాక్షసుడిగా రవిశంకర్ కనిపించగా.. అనుష్కను పెళ్లి చేసుకోవాలని ఆరాటపడే అబ్బాయిగా రాహుల్ పాత్రలో గణేష్ వెంకట్రామన్ కనిపించారు. ఇక ఈ సినిమాలో రాహుల్ కీలక పాత్ర పోషించింది. ఓవైపు అనుష్క కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉంటూనే వాళ్లకు కీడు చేయాలనుకునే అబ్బాయిగా నెగటివ్ రోల్‌లో అద్భుతంగా మెప్పించాడు. డ్యూయల్ షేడ్స్ పండించాడు.
ఈ సినిమాతోనే తెలుగువారికి దగ్గరైనా గణేష్ వెంకట్‌రామన్.. ఈ సినిమాతోనే కాదు, టాలీవుడ్‌తో పాటు.. పలు తమిళ్, హిందీ సినిమాల్లోను నటించి ఆకట్టుకున్నాడు. ఇప్పటికీ తమిళ్‌లో స్టార్ నటుడుగా కొనసాగుతూ బిజీగా గడుపుతున్న గణేష్.. తెలుగులో అప్పుడప్పుడు తళ్ళుకున మెరుస్తున్నాడు. అలా ఇప్పటికే త్రిష నాయకి మూవీ తో పాటు.. రాగల 24 గంటల్లో, విజయ్.. వారసుడు, శబరి లాంటి ఎన్నో సినిమాల్లో తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు.
అయితే.. ప్రస్తుతం ఈ నటుడి భార్య కూడా ఒక టాలీవుడ్ క్రేజీ బ్యూటీ అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు నిషా కృష్ణన్. ఈ పేరు చెప్తే టక్కున గుర్తుకు రాకపోవచ్చు.. విశాల్ – ఇంద్రుడు మూవీ హీరోయిన్ అంటే వెంటనే గుర్తుకొస్తుంది. అలాగే కృష్ణుడికి వారసుడు అనే మరో టాలీవుడ్ మూవీలోను నిషా హీరోయిన్గా కనిపించింది. ఇక నిషా, గణేష్‌లు ఇద్దరు ప్రేమించుకుని.. ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో 2017లో వైవాహం చేసుకున్నారు. వీరికి సమీరా, అమర్ అనే కొడుకు, కూతురు ఉన్నారు.