నాగ అశ్విన్ డైరెక్షన్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడి. ఈ ఏడది జూన్‌లో రిలీజై ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేసి ఆడియన్స్ నుంచి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అలాగే.. ఫుల్ రన్‌లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.1200 కోట్లకు పైగా వసూలు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇలాంటి క్రమంలో నాగ అశ్విన్ తాజాగా తన చిట్‌చాట్‌లో సినిమాపై ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు.
సలార్ డైనోసార్ అయితే.. కల్కి డ్రాగన్ అంటూ చెప్పిన ఆయన.. బాక్సాఫీస్ దగ్గర మరింత ప్రభావం చూపేందుకు సలార్ 2, స్పిరిట్ ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయని వివరించాడు. ఈ సినిమాలో రూ.1500 కోట్ల హ్యాట్రిక్ వసూళ్లు సాధించే అవకాశం ఉందని కామెంట్ చేశాడు. ఇదే క్రమంలో నాగ అశ్విన్ మాట్లాడుతూ.. కల్కి 2898 ఏడి.. సిక్వెల్ త్వరలో రానుందని వెల్లడించాడు. ఇక ఫస్ట్ పార్ట్ షూటింగ్ సమయంలో ఒక పార్ట్ తీయాలా.. లేదా రెండు పార్ట్‌లుగా తీయాలా అని చాలా ఆలోచించమని.. చిట్టీలు వేసి రెండు భాగాలుగా తీయాలని ఫిక్స్ అయ్యామంటూ చెప్పుకొచ్చాడు.
ఒకవేళ ఇదే ప్రాజెక్టులో లార్డ్ కృష్ణ గెటప్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించి ఉంటే ఈ సినిమా 2000 కోట్ల కలెక్షన్లు కచ్చితంగా కొల్లగొట్టేదని.. ఇదివరకు ఎన్నడూ లేనివిధంగా ఆల్ టైం బ్లాక్ బస్టర్గా నిలిచేదంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాదు.. ఒకవేళ కల్కి సీక్వెల్ ఫుల్ లెన్త్ గాడ్ రేల్ ఊహించుకుంటే ఖచ్చితంగా మహేష్ బాబును ఆ పాత్రకు ఒప్పిస్తానని నాగ అశ్విన్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అశ్విన్ కామెంట్స్ నెటింట వైరల్‌గా మారడంతో నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒకవేళ నిజంగా కల్కి సీక్వెల్లో ఫుల్ లెన్త్ రోల్ లో మహేష్ బాబు కనిపిస్తే మాత్రం.. సినిమా బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.