మీరెవ్వర్రా వద్దనడానికి.. టికెట్ రేట్ల పై నాగ వంశీ సెన్సేషనల్ కామెంట్స్..

నందమూరి నట‌సింహం బాలయ్య, బాబి కొల్లి కాంబోలో డాకుమహ‌రాజ్‌ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 12న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అఖండ సినిమా నుంచి స‌క్స‌స్ ట్రాక్‌లో దూసుకుపోతున్న బాలయ్య.. ఇందులో భాగంగానే కథ‌ల‌ని ఆచితూచి ఎంచుకుంటున్నాడు. అలా.. తాజాగా బాలయ్య నటించిన డాకు మహారాజ్‌పై కూడా ఇప్పటికే ఆడియన్స్‌కు పిక్స్ లెవెల్‌లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో ఎలాగైనా మరోసారి హ్యాట్రిక్‌కు నాంది పలకడం కాయమంటూ బాలయ్య అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతున్న క్రమంలో ప్రమోషన్స్‌పై కాన్సన్ట్రేట్ చేసిన సితార ఎంటర్టైన్మెంట్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

Daaku Maharaaj (2025) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

నందమూరి ఫ్యాన్స్‌ను ఏకం చేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ కామెంట్స్‌ ప్రస్తుతం సంచలనంగా మారాయి. తాజాగా.. సినిమా గురించి ఆయన మాట్లాడుతూ బాలయ్య మాస్ హీరో.. ఆయన దృష్టిలో పెట్టుకునే డైరెక్టర్ కథ‌ రాసాడంటూ ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు. అన్ని ఎమోషన్స్ సినిమాలో ఉన్నాయని.. ఇప్పటివరకు సినిమా సర్ప్రైజ్లు ఏమీ రివీల్ చేయలేదంటూ చెప్పినా నాగవంశీ.. డెకాయిట్ గా మారే ఎలివేషన్ సినిమాకి హైలెట్ కానుందని హింట్ ఇచ్చాడు. ముగ్గురు హీరోయిన్స్ సినిమాలో ఉన్నారని.. ముగ్గురితో బాలకృష్ణ ఎమోషనల్ సీన్స్ ఉంటాయంటూ ఎన్నో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.

NRIPage | Box Office | Movie News | 'NBK 109' New Film Title Revealed:  Daaku Maharaj

ఈ క్రమంలోనే నాగ వంశీ టికెట్ ధరపై రియాక్ట్ అయ్యాడు. పెట్టిన ఖర్చును, బయ్యర్లకు అమ్మిన ధ‌ర ఆధారంగా చేసుకుని టికెట్ రేట్లు ఫిక్స్ ఫిక్స్ చేస్తార‌ని.. దేవర విషయంలో నాకు ఇంత ఖర్చయింది కనుక.. నాకు ఇంత ధర రావాలని ప్రభుత్వాలను కోరుతు్నాం. అలాగే పుష్ప 2 విషయంలో వాళ్ళు పెట్టిన ఖర్చుకు టికెట్ రేట్ ఎలా ఉంటే న్యాయం జరుగుతుందో అదే అడుగుతారు. సినిమా టికెట్ ధరల విషయంలో ఏ రేట్ కరెక్ట్.. ఏది కాదు అని ఎవరూ చెప్పలేము అంటూ వెల్లడించాడు. సినిమా పూర్తయిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని టికెట్ రేటు ఉంటుందని.. ఒక సంవత్సరంలో రిలీజ్ అయ్యే రెండు మూడు సినిమాలకు మాత్రమే టికెట్ రేట్లు పెరుగుతున్నాయని.. ఈ సంవత్సరంలో కల్కి, దేవర, పుష్ప 2 మూడు సినిమాలకు మాత్రమే టికెట్ రేట్స్ పెంచారు అంటూ వెల్లడించాడు. ప్రస్తుతం నాగ వంశీ చేసిన కామెంట్స్ నెటింట వైరల్ గా మారుతున్నాయి.