పోలీసులు బన్నీపై కేస్ విత్ డ్రా చేసుకోనున్నారా.. ఏం జరిగనుందంటే..?

పుష్ప 2 ప్రీమియర్స్ క్రమంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడం.. ఆమె కొడుకు శ్రీ తేజకు తీవ్ర గాయాలు అవడంతో ఆ వివాదం ఏ రేంజ్ లో సంచలనం సృష్టించిందో తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ అరెస్టు కేసు దుమ్మారం రేపింది. చాలామంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనలో అర్జున అరెస్టై, బెయిల్ తీసుకొని ఇంటికి వచ్చిన క్రమంలో మరోసారి అల్లు అర్జున్ అరెస్ట్ అవుతాడా.. లేదా కేసు విషయంలో తెలంగాణ గవర్నమెంట్ కాస్త తగ్గుతుందా అనే దానిపై అంతటా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం మ‌ధ్యంతర బెయిల్ పై తిరుగుతున్న బన్నీ.. గడువు త్వరలోనే ముగియనుంది.

ఈ క్రమంలోనే జనవరి 10న హైకోర్టులో మరోసారి బన్నీ హాజరుకానున్నట్లు సమాచారం. ఆరోజు అల్లు అర్జున్ దోషిగా పరిగణిస్తే.. ఎన్ని రోజులు శిక్ష పడుతుంది అనేది హాట్‌ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే బన్నీపై కేసు పెట్టిన పోలీసులు ఆ కేసులు విత్ డ్రా చేసుకునే అవకాశం ఏదైనా ఉందా అనే ధోరణిలో కూడా బ‌న్నీ లాయ‌ర్ నిరంజన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇక వాళ్లతో కూడా సంప్రదింపులు జరిపి తర్వాత ఓ దృఢ నిశ్చ‌యంతో ముందుకు సాగాలని చూస్తున్నట్లు సమాచారం. పోలీసులు ఈ విష‌యంలో ఏమాత్రం రియాక్ట్ కాలేదని.. వాళ్లు కేసు విత్ డ్రా చేసుకోవడం చాలా వరకు కష్టమే అంటూ తెలుస్తోంది.

ఇలాంటి క్రమంలో తప్పు ఎవరిది అనేది తెలిస్తే మాత్రం కోర్టులో వాళ్లకు తప్పకుండా కఠిన శిక్ష పడుతుంది. మరి ఒకవేళ అల్లు అర్జున్ తప్పు చేశాడని కోర్టు నిర్ధారిస్తే.. అతనికి ఎలాంటి శిక్ష వేయనుంది.. ఈ కేసు ఎక్కడ వరకు వెళ్ళిపోతుందని.. సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. ఏదేమైనా అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో పెను ప్రభంజనం క్రియేట్ చేసిన క్రమంలో.. ఆయనకు ఆ సంతోషాన్ని పిసరంత కూడా లేకుండా పోయింది.. ఈ క్ర‌మంలోనే అల్లు అర్జున్ ఫ్యూచర్‌లో ఎలాంటి సమస్యలు ఎదుర్కోబోతున్నాడు.. తన స్టార్ట్ డం ఏ రేంజ్‌లో ప్రభావం పడబోతుంది.. అని టెన్షన్ బన్నీ అభిమానులతో పాటు.. సాధన ఆడియన్స్‌లోను మొదలైంది. ఏదేమైనా ప్రస్తుతం కష్ట కాలంలో ఉన్న అల్లు అర్జున్ ఈ కేసు నుంచి ఎవరు సేవ్ చేస్తారో వేచి చూడాలి.