ఇక సినిమాలో హీరో స్టార్ డం బట్టి వారికి రెమ్యూనరేషన్ ఇస్తూ ఉంటారు .. రీసెంట్గా స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు భారీగా పెరిగిపోయాయి .. ఒక్కో హీరో సినిమాకు 100 కోట్లకు మించి అందుకుంటున్నా టాప్ హీరోలు కూడా ఉన్నారు. చాలా సినిమాల బడ్జెట్లో హీరో రెమ్యూనిరేషన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇతర సపోర్టింగ్ పాత్రలో ప్రముఖ నటీనటులు తీసుకుంటే వారికి కూడా ఎక్కువ ఖర్చు చేయాల్సిందే. ఈ రీసెంట్ టైమ్స్ లో విలన్ పాత్రలకు ఫుల్ క్రేజ్ వచ్చింది. భారీ బడ్జెట్ సినిమాలో కొందరు హీరోలే విలన్ గా నటిస్తున్నారు.
ఇక ఇలాంటి సమయంలో విలన్ పాత్రకు కూడా నిర్మాతలు భారీగా ఖర్చు చేయాల్సిందే. ఇక ఇప్పుడు తాజాగా ఓ సినిమాలో విలన్ పాత్రకు ఓ హీరో ఏకంగా 200 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఇక దీంతో ఇండియాలోనే ఓ సినిమాకి అత్యధిక పారితోషకం తీసుకున్న విలన్ గా చరిత్ర క్రియేట్ చేశాడు. కన్నడ స్టార్ హీరో యాష్ .. కేజిఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో భారీ స్టార్డం తెచ్చుకున్నారు. ఇండియన్ సినిమాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న విలన్ గా యాష్ రికార్డ్ క్రియేట్ చేశాడు. బాలీవుడ్లో నితీష్ తివారి తెరకెక్కిస్తున్న రామాయణం సినిమాలో రావణుడు పాత్రలో విలన్ గా నటిస్తున్నాడు.. అందుకోసం 200 కోట్లు రెమ్యూనరేషన్ అందుకున్నాడు.
మన భారతీయ మహా ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాముడిగా రన్బీర్ కపూర్ నటిస్తున్నారు, అయితే ఇప్పుడు ఆయనకంటే రావణుడు పాత్ర చేస్తున్న యాష్ అత్యధిక రెమ్యూనిరేషన్ అందుకున్నారు. ఇలా ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యూనిరేషన్ పెయిడ్ విలన్ గా రికార్డులు క్రియేట్ చేశారు. ప్రభాస్ కల్కి సినిమాకు గాను కమల్ హాసన్ ఏకంగా 40 కోట్లు తీసుకుని .. భారీ మొత్తంలో పారితోషికం తీసుకున్న విలన్ గా నిలిచారు. అయితే ఇప్పుడు ఈ రికార్డుకు నాలుగు రేట్ల కంటే ఎక్కువ మొత్తం తీసుకుంటూ తిరగరాసాడు యాష్. అలాగే రామాయణం సినిమాకి సహ నిర్మాతగా కూడా యష్ ఉన్నారు.
ఇలా స్టార్ హీరోలను మించి విలన్ పాత్ర కోసం ఏకంగా 200 కోట్లను అందుకుంటున్నాడు యాష్.బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కొన్ని సంవత్సరాలగా ఒక్కో సినిమాకి సుమారు 150 కోట్లు అందుకుంటున్నాడు. పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకి 120 కోట్ల నుంచి 150 కోట్లు వరకు తీసుకుంటున్నాడు. అలాగే సల్మాన్ ఖాన్ కూడా ఒక్కో సినిమాకి 120 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు యాష్ వీళ్ళందర్నీ దాటేశాడు. అది కూడా విలన్ పాత్రతో. మన ఇండియాలో ఒక సినిమాకి 200 కోట్లు అంటే చాలా ఎక్కువ.. అల్లు అర్జున్ పుష్ప2, విజయ్ ది గోట్, రజనీకాంత్ జైలర్ సినిమాలకు మాత్రమే అంత తీసుకున్నారు. ఇప్పుడు యాష్ ఈ మార్కును దాటేశాడు. ఈ రామాయణం సినిమాలో రాముడిగా రణబీర్ నటిస్తుండగా సీత పాత్రను లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి నటిస్తుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నితీష్ తివారి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.