ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోలుగా ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. వారు ఈ రేంజ్ లో సక్సెస్ సాధించడానికి ప్రధాన కారణం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తరికెక్కిన సినిమాలే అనడంలో అతిశయోక్తి లేదు. ఇక రాజమౌళి తన సినీ కెరీర్‌లో తెరకెక్కించిన ప్రతి సినిమాతోను బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ తెలియని డైరెక్టర్గా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేయడానికి పాన్ ఇండియా లెవెల్ సెలబ్రిటీస్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అలాంటి రాజమౌళితో పనిచేసే అవకాశం వచ్చినా బాలయ్య రెండుసార్లు ఆ సినిమాలను మిస్ చేసుకున్నాడట. ఇంతకీ వారిద్దరు కాంబోలో మిస్ అయిన ఆ రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు ఏంటో.. వాటి కారణాలేంటో.. ఒకసారి తెలుసుకుందాం. రాజమౌళి, ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సింహాద్రి ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో తెలిసిందే. అయితే ఈ సినిమా కథని మొదట బాలయ్యకు జక్కన్న వినిపించాడట. అయితే అప్పటికే బాలయ్య పలనాటి బ్రహ్మనాయుడు సినిమాతో బిజీగా ఉండడంతో.. ఈ సినిమాకు నో చెప్పేసాడట. బాలయ్య, బి గోపాల్ కాంబినేషన్కు అప్పటికే బ్లాక్ బస్టర్ కాంబో పేరు వచ్చింది. ఇక రాజమౌళి కేవలం అప్పటివరకు ఒకే ఒక్క సినిమా తెరకెక్కించి సక్సెస్ అందుకున్నాడు. దీంతో బాలయ్య.. పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా నటించేందుకే ఇంట్రెస్ట్ చూపించలేదు.
ఈ సినిమా తర్వాత రాంచరణ్ హీరోగా నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న మగధీర కథను కూడా మొదట జక్కన్న.. బాలయ్యకే చెప్పాడట. ఈ విషయాన్ని బాలయ్య అన్‌స్టాపబుల్ షో లో రివిల్ చేశాడు. ఏవో కారణాల వల్ల సినిమా చివరకు రామ్ చరణ్ చేయాల్సి వచ్చిందని వెల్లడించాడు. తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదటిసారిగా రూ.50 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాగా మగధీర ఎలాంటి రికార్డులు సృష్టించిందో తెలిసిందే. అలా ఇప్పటివరకు బాలయ్య, జక్కన్న కాంబోలో రావలసిన రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు మిస్ అయ్యాయి. భవిష్యత్తులో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే బాగుండని నందమూరి అభిమానులతో పాటు.. రాజమౌళి ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫ్యూచర్లో అయినా ఈ కాంబో సాధ్యమవుతుందో లేదో వేచి చూడాలి.