స్టార్ నటి కస్తూరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాతో కమలహాసన్‌కు చెల్లెలి పాత్రలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా తర్వాత మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. అంతేకాదు నటిగా ఎన్నో సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంది. ఈ క్రమంలోని టాలీవుడ్‌లో నాగార్జున హీరోగా నటించిన అన్నమయ్య సినిమాల్లో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. తర్వాత పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే కొంతకాలం సినిమాలకు దూరమైనా ఈ ముద్దుగుమ్మ.. మళ్ళి సీరియల్స్, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ బిజీ అయింది.
తెలుగులో మాత్రమే కాదు కన్నడ, మలయాళ ఇండస్ట్రీలోను పలు సీరియల్స్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న ఈ అమ్మడు.. ఎప్పటికప్పుడు వివాదాల్లో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతూనే ఉంది. అలా.. ఇటీవల బిగ్‌బాస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. అంతేకాదు.. గతంంలో తెలుగువారిపై కూడా అనుషిత వ్యాఖ్యలు చేసి ట్రోల్స్ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో కస్తూరిని అరెస్టు కూడా చేశారు. ఇక తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన కస్తూరి.. ఇందులో భాగంగా మాట్లాడుతూ జైలు జీవితం ఎలా ఉంటుందో చెప్పుకొచ్చింది.
జైల్లోకి వెళ్లిన టైం లో చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తారని వెల్లడించింది. పుట్టినప్పుడు ఎలా ఉంటామో అలానే చెక్ చేస్తారని ఆమె వివరించింది. ఒంటిమీద నూలు పోగు లేకుండా చెక్ చేసి పంపిస్తారని చెప్పుకొచ్చింది. అయితే చెక్ చేసే వాళ్ళు లేడీస్ ఉంటారని చెప్పిన కస్తూరి.. ప్రైవేట్ పార్ట్స్‌లో ఏమైనా ఉన్నాయా అని కూడా చెక్ చేశారని చెప్పుకొచ్చింది. దీంతోపాటే తను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన టైంలో.. ఓ డైరెక్టర్ లిఫ్ట్‌లో తనను నలిపూయాలని చూసాడంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. అయితే ఆ డైరెక్టర్ ఎవరు అనే విషయాన్ని మాత్రం కస్తూరి రివీల్ చేయలేదు. ప్రస్తుతం కస్తూరి కామెంట్స్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.