టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్.. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్.. దిల్ రాజు తాజాగా సినీ పెద్దలతో కలిసి సీఎంతో భేటి జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా దిల్‌రాజు ఈ మీటింగ్‌పై రియాక్ట్ అయ్యారు. సీఎంతో జరిగిన భేటీలో.. నెగటివ్ అంశాలు ఏవి రాలేదని.. అంత సజావుగా సాగిందంటూ చెప్పుకోచ్చాడు. ఈ మీటింగ్ గురించి ఎన్నో మాధ్యమాలలో ఫేక్ వార్తలు వైరల్ అవుతున్నాయని చెప్పిన దిల్‌రాజు.. సీఎం మీటింగ్‌లో అసలు జరగని వాటిని కూడా జరిగినట్లు రాస్తున్నారని.. రేవంత్ రెడ్డితో మీటింగ్ చాలా బాగా జరిగింది.. దానిలో 0.5% కూడా నెగెటివిటీ లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ పట్ల సిఎం చాలా సానుకూలంగా మాట్లాడాడని.. బెనిఫిట్ షోలు, టికెట్స్ రేట్లు గురించి అసలు టాపిక్ రాలేదంటూ దిల్ రాజు వివరించాడు. చాలా వీడియోలో ప్రచారం జరుగుతున్నట్లు పోలీసులు, సంధ్య థియేటర్ దగ్గర జరిగిన వీడియోలు మాకు అసలు చూపించలేదని క్లారిటీ ఇచ్చాడు. ఇక బాన్సర్ల విషయాన్ని మాకు డీజిపి చెప్పారు.. ప్రతిది అకౌంటబిలిటీగా ఉండాలని మాత్రమే ఆయన సూచించారు.
హాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్‌లో షూట్ జరిపేలా అభివృద్ధి చేద్దామని మాట్లాడారు. అలాగే.. హైదరాబాద్‌కు ఐటి, ఫార్మా రంగాలు ఎంత కీలకమో సినీ పరిశ్రమ అంతే ముఖ్యమని సీఎం భావిస్తున్నారని వెల్లడించాడు. సామాజిక సేవా కార్యక్రమాల్లో సెలబ్రిటీలు పాల్గొన్నాలని వివరించాడు. ఇవే మీటింగ్‌లో ప్రధాన అంశాలని అంతకుమించి నెగిటివ్‌గా ఏమి జరగలేదు అంటూ దిల్‌రాజు క్లారిటీ ఇచ్చాడు.