ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస సినిమాలో నటించి.. స్టార్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దురవైన హీరోలు చాలామంది ఉన్నారు. తమ అభిమాన హీరో అలా ఇండస్ట్రీ నుంచి దూరమై ఇప్పుడు ఏం చేస్తున్నారు.. ఎలా ఉన్నారు.. తెలుసుకోవాలని, చూడాలని ఆసక్తి అభిమానుల్లో కచ్చితంగా ఉంటుంది. అయితే ఒకప్పుడు అలా ఇండస్ట్రీలో సక్సస్‌ఫుల్‌గా రాణించి.. తర్వాత ఇండస్ట్రీకి దూరమైన వారిలో హీరో వడ్డే నవీన్ కూడా ఒకడు. వడ్డే నవిన్ అనగానే టక్కున ఆడియన్స్‌కు గుర్తుకు రాకపోవచ్చు.
జాబిలమ్మ నీకు అంత కోపమా అంటూ స్క్రీన్ పై మెరిసిన వడ్డే నవీన్.. ఆడియన్స్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతాడు. పెళ్లి సినిమాలో ఈ సాంగ్ అప్పట్లో ఏ రేంజ్ సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఈ సినిమాతో పాటు.. మనసిచ్చి చూడు, నా హృదయమలో నిదురించే చెలీ, ప్రేమించే మనసు, చాలా బాగుంది, మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది ఇలాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలో నటించి ఆకట్టుకున్నాడు. అయితే.. తర్వాత ఇండస్ట్రీకి మెల్లమెల్లగా దూరమైన వడ్డే నవీన్ పలు బిజినెస్ రంగాల్లో అడుగుపెట్టి బిజీగా గడుపుతున్నారు.
ఇలాంటి క్రమంలో తాజాగా పరుచూరి రామ కోటేశ్వరరావు, కొత్తపల్లి గీత దంపతుల కుమారుడు అభినయ్ తేజ్ వివాహానికి హాజరయ్యారు. దీంతో ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ నెట్టింట తెగ వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు చూసిన జనం అంతా ఆశ్చర్యపోతున్నారు. ఏంటి పెళ్లి మూవీ హీరో ఇంతలా మారిపోయాడు అంటూ.. ఒకప్పుడు స్లిమ్ గా.. క్యూట్ స్మైల్ తో ఆకట్టుకున్న వడ్డే నవీన్ ఏంటి.. ఇంత చబ్బిగా అయ్యాడు అంటూ.. అసలు మా కళ్ళను మేమే నమ్మలేకపోతున్నాం అంటూ.. రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.