సంధ్య థియేటర్ ఇష్యూ తర్వాత తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్ పై కన్నెర చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగు పరిశ్రమలో తీవ్ర అలజడ్డి నెలకొంది. ఇండస్ట్రీని టార్గెట్ చేస్తూ రాజకీయ ప్రతినిధులు చాలామంది నెగటివ్ కామెంట్స్ చేసినప్పటికీ.. ఇండస్ట్రీ పెద్దలు మాత్రం మెల్లకుండిపోయారు. భవిష్యత్తులో బెనిఫిట్ షో, టికెట్ రేట్ల పెంపు ఉండవని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించగా.. తెలంగాణ ప్రభుత్వానికి, సినీ ఇండస్ట్రీకి మధ్య దూరం పెరుగుతుందనే వాదన నెట్టింట వైరల్ గా మారింది. మరోవైపు సంక్రాంతికి భారీ సినిమాలు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
వీటిలో రెండు పెద్ద సినిమాలు నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తుండడంతో.. ఈ సినిమా రిలీజ్ టైం లో ఎలాంటి పొరపాటు జరిగిన భారీ మూల్యం చెల్లించక తప్పదని క్లారిటీ వచ్చేసింది. అయితే కొద్ది రోజుల క్రితం ఎఫ్‌డిసి చైర్మన్గా దిల్‌రాజును నియమించిన క్రమంలో.. పుష్ప సినిమా డ్యామేజ్ విషయంలో దిల్ రాజు గేమ్ ఛేంజర్ అవుతారని అంతా అనుకున్నారు. అనుకున్నట్లుగానే దానిని నిజం చేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి, చిత్ర పరిశ్రమకు మధ్యవర్తిగా దిల్ రాజు వ్యవహరించారు. అందులో భాగంగా తను అమెరికా నుంచి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ తో సినీ పెద్దలకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఇండస్ట్రీ అభివృద్ధికి, సినిమాలకు ప్రత్యేక అనుమతులు ఇచ్చే అంశంపై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని దిల్ రాజు వెల్లడించాడు. స్వయంగా ముఖ్యమంత్రితో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత దిల్ రాజు ఇలాంటి స్టేట్మెంట్ చేయడంతో.. గేమ్ ఛేంజర్‌కు బెనిఫిట్‌షోస్, టికెట్ రేట్ల పెంపులు ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ.. అలాంటిది జరగలేదు. సిఎం రేవంత్ రెడ్డి ఒప్పించేందుకు దిల్ రాజు ఎంతగానో ప్రయత్నించినా రేవంత్ రెడ్డి మాత్రం అసెంబ్లీలో చెప్పిన మాటలకు కట్టుబడి ఉంటానని.. ఆ పర్మిషన్ల ఆలోచనలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పినట్లు సమాచారం. ఇండస్ట్రీ మొత్తం దీనిపై ఒప్పించే ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి మాత్రం కరాకండిగా నో చెప్పేసాడట. టాలీవుడ్ మొత్తం ఏకమై దిల్ రాజు తో కలిసి రేవంత్ రెడ్డిని కలిసి ప్రయత్నం చేసిన వారి ప్లాన్ బెడిసి కొట్టిందని తెలుస్తుంది.