బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ జాక్వలిన్ ఫెర్నెండేజ్‌కు సినీ ్పరియులలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే తాజాగా.. జాక్వాలిన్‌కు ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ పెద్ద కానుక ఇచ్చాడంటూ న్యూస్ వైరల్ అవుతుంది. క్రిస్మస్ కానుకగా ఆమెకు ఎంతో ఇష్టమైన పారిస్‌లో వైన్ యార్డ్ ను చంద్రశేఖర్ గిఫ్ట్ గా ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు. తనను బేబీ గర్ల్, మై లవ్ అని సంబోధిస్తూ ఓ సందేశాన్ని కూడా ఆమెకు పంపించాడని తెలుస్తుంది.
బేబీ గర్ల్.. మేరీ క్రిస్మస్ మై లవ్. మనకెంతో ఇష్టమైన పండుగ ఇది. కాకపోతే మనమిద్దరం కలిసి జరుపుకోలేకపోతున్నాం. ఏదేమైనా మన మనసులు దగ్గరయ్యాయి. నీ చేతులు పట్టుకుని అందమైన నీ కళ్ళలోకి చూస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పాలనిపిస్తుంది. మనం ఎంత దూరంగా ఉన్నా.. నేను నీ శాంత క్లాజ్ కాకుండా మాత్రం ఆపలేరు. ఈ ఏడాది నీకు చాలా స్పెషల్ బహుమతి ఇవ్వాలనుకుంటున్న అంటూ సుకేష్ చంద్రశేఖర్ రాసుకొచ్చాడట. ఈరోజు నీకు వైన్ బాటిల్ గిఫ్ట్ గా ఇవ్వడం లేదు.. నువ్వు ఎప్పుడు కలలుకనే కంట్రీ ఆఫ్ లవ్ గా అభివర్ణించే పారిస్ లో ఓ వైన్ యాడ్ నే కానుకగా ఇస్తున్న అంటూ ఆ సందేశంలో మెన్షన్ చేశాడు.
ఆ తోటలో నీ చేయి పట్టుకొని నడవాలని ఉంది. నేనొక్క పిచ్చోడినని ఈ ప్రపంచం అనుకున్నా.. నీ ప్రేమలో నిజంగా నేను పిచ్చోడిని అయ్యా అంటూ ఆ లేఖలో రాసుకొచ్చాడట. ఇక నేను రిలీజ్ అయ్యే వరకు వేచి చూస్తుండు. రిలీజ్ అయిన తర్వాత ప్రపంచం మన జంటని చూస్తుంది. అని ఆ లేఖలో పేర్కొన్నాడు సుకేష్. ఈ విధంగా లెటర్లు రాయడం ఇదేమి మొదటిసారి కాదు. ఆయన గతంలోనూ ఎన్నో ప్రేమలేఖలు పంపించారు. ప్రస్తుతం ఢెల్లీ జైల్‌లో ఉన్న సుఖేష్.. 2020 జూన్ నుంచి మే 2021 వరకు ముంబయిలో ఫోన్‌లో వాయిస్ మాడ్యులర్ వినియోగిస్తూ.. ర్యాన్‌బాక్సి మాజీ యజమాని శివేంద్ర సింగ్ భార్య అథితి సింగ్‌కు ఫోన్లు చేస్తూనే ఉన్నాడు.
లా సెక్రటరీ అనుపం కుమార్‌గా తనని తాను పరిచయం చేసుకుని.. భర్తకు బయలు ఇప్పిస్తానని రూ.200 కోట్లకు పైగా వసూలు చేశారు. ఎన్నాళ్ళైనా బెయిల్ రాకపోవడంతో అనుమానం వచ్చిన అథితి పోలీసులను ఆశ్రయించడంతో.. విషయం బయటపడింది. ఈ క్రమంలోనే అతను జాక్వలిన్‌తో క్లోజ్‌గా ఉన్న ఫొటోస్ రివిల్ అయ్యాయి. ఆమె.. తన ప్రియురాలుగా సుఖేష్ చెప్పుకొచ్చాడు. కాగా జాక్వలిన్.. తన జీవితాన్ని నరకం చేశాడంటూ.. దానిపై రియాక్ట్ అయింది. అతను లైఫ్ తో ఆడుకున్నాడని.. తన కెరీర్‌ను దెబ్బతీశాడని.. న్యాయస్థానం మీదట వాంగ్మూలం ఇచ్చింది. జాక్వలిన్ హోం శాఖలో ఓ ముఖ్య అధికారిగా సుకేష్ తనను తాను జాక్వెలిన్ పరిచయం చేసుకున్నట్లు చెప్పుకొచ్చింది.