సినీ ఇండస్ట్రీలో వారసులగా ఎప్పటికప్పుడు ఎంతోమంది అడుగుపెడుతూనే ఉంటారు. ఇక టాలీవుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎంతోమంది సీనియర్ స్టార్ హీరోల వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తమ టాలెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. వారిలో కొందరు స్టార్ హీరోలుగా పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ కూడా అందుకుంటున్నారు. మరికొందరు.. సరైన సక్సెస్ కోసం కష్టపడుతున్నారు. కాగా ప్రస్తుతం టాలీవుడ్ మెయిన్ పిల్లర్లలో రాణిస్తున్న సీనియర్ హీరోలు చిరు, బాలయ్య, నాగార్జున, వెంకటేష్‌ల పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. ఈ నలుగురు ఇండస్ట్రీలో ఇప్పటికీ దూసుకుపోతున్నారు. తెలుగు సినిమాలకు కిరిటాలుగా రాణిస్తున్నారు.
అయితే.. ఈ నలుగురు స్టార్ హీరోల వారసులు ప్రస్తుతం ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ పాన్ ఇండియా ఇమేజ్‌తో దూసుకుపోతుంటే.. బాలయ్య వారసుడిగా మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నాడు. అయితే ఇప్పటికే నందమూరి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కాగా నాగార్జున కుటుంబం నుంచి నాగచైతన్య, అఖిల్ ఇద్దరు హీరోలుగా అడుగుపెట్టిన సరైన సక్సెస్ అందకపోవడంతో.. ఇప్పటికి స్టార్ హీరోలుగా తమనుతాము ప్రూవ్ చేసుకునే పనిలో బిజీగా గడుపుతున్నారు.
ఇక మిగిలింది.. విక్టరీ వెంకటేష్. వెంకటేష్ కుమారుడు అర్జున్ ప్రస్తుతం అమెరికాలో తన చదవడం పూర్తి చేస్తున్నాడు. వెంకీకి మొదట ముగ్గురు కూతుళ్లు తర్వాత ఒక కొడుకు జన్మించారు. ఈ క్రమంలోనే అతను చిన్నవాడు కావడంతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇప్పటివరకు ఆలస్యం అవుతూ వచ్చింది. ప్రస్తుత 20 ఏళ్ల వయసులో ఉన్న అర్జున్.. విదేశాల్లో తన చదువు పూర్తి చేసుకున్న తర్వాత.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తారా.. లేదా.. అనే దానిపై తాజాగా వెంకటేష్ రియాక్ట్ అయ్యారట. ఇటీవల బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 4 సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్‌కు వెంకటేష్ హాజరైన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే వారసుల అంశం వాళ్ళ మధ్య వచ్చినట్లు సమాచారం. ఇందులో వెంకటేష్ కొడుకు అర్జున్ గురించి ప్రస్తావించారని.. హీరోగా తన కొడుకు ఎంట్రీ ఎప్పుడో క్లారిటీ ఇచ్చారని తెలుస్తుంది. అయితే ప్రస్తుత వెంకటేష్ తనకు నచ్చే కథలను ఎంచుకుంటూ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొడుకు ఎంట్రీ ఇచ్చేలోపు మరికొన్ని సినిమాలతో సక్సెస్ అందుకోవాలని వెంకటేష్ ఆరాటపడుతున్నాడు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆడియన్స్ను పలకరించనున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్ల గా కనిపించనున్నారు.