మ్యాక్స్ రివ్యూ : కిచ్చా సుదీప్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ప‌డిందా..?

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్.. సౌత్ ఇండియాలో హీరోగా ఎలాంటి పాపులారిటి ద‌క్కించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్‌లోను ఈగ‌ సినిమాతో విలన్‌గా నటించి విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్న సుదీప్.. ఈ క్రమంలోనే ఎన్నో సినిమాల్లో గెస్ట్ అపీరియన్స్ తో కనిపించి మెప్పించాడు. ఇక త‌న‌ గత సినిమా విక్రాంత్ రాణాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. కాగా సుదీప్‌ తాజాగా నటించిన మూవీ మ్యాక్స్‌ నేడు గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీతో సుదీప్ తన ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ దక్కించుకున్నాడా.. లేదా.. సినిమా ఆడియ‌న్స్‌ను ఏ రేంజ్‌లో ఆక‌ట్టుకుందో విశ్లేషణలో చూద్దాం.

Max: Know movie review, box office prediction and more about Kiccha Sudeep  starrer | Kannada News - News9live

స్టోరీ:

అర్జున్ అలియాస్ మ్యాక్స్ (కిచ్చ‌ సుదీప్) సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ప‌నిచేస్తాడు. ఇక తన విధులను నిర్వర్తించే క్రమంలో.. తల్లితో కలిసి కొత్త ఊరికి వెళుతుండగా.. వీర, మైకెల్ అన్నే ఇద్దరు పొలిటిషన్ కొడుకులు.. మహిళ పోలీస్‌తో అసభ్యంగా ప్రవర్తించడం చూసి.. మ్యాక్స్ ఇద్దర్ని అరెస్ట్ చేస్తాడు. ఇక వీర, మైఖేల్ అరెస్ట్ సంగతి తెలిసిన‌ పొలిటిషన్ అనుచరులు.. వాళ్ళను విడిపించే క్రమంలో.. పోలీస్ స్టేషన్ పై దాడి చేయడంతో.. ఆ దాడిలో వీర, మైకెల్‌.. ఇద్దరు చనిపోతారు. వీళ్ళు చనిపోవడానికి అసలు కారణాలేంటి.. క్రైమ్ డిపార్ట్మెంట్ సిఐ (రూప).. నుండి మ్యాక్స్, అలాగే అతని టీంకు ఎలాంటి ఇబ్బందులు క‌లిగాయి. మ్యాక్స్‌ సమస్యలను ఎలా ఎదుర్కొన్నాడు అనే విషయాలు తెలియాలంటే సినిమాలో చూడాల్సిందే.

Max (kiccha 46) Movie (2024): Release Date, Cast, Ott, Review, Trailer,  Story, Box Office Collection – Filmibeat

నటీనటుల పర్ఫామెన్స్:

24 గంటల్లో జరిగిన ఓ క్రైమ్ థ్రిల్లర్‌గా.. ఆడియన్స్‌ను మెప్పించేలా సినిమాను రూపొందించాడు సుదీప్. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సినిమా సక్సెస్ కు సుదీప్ న‌ట‌న కీలకపాత్ర పోషించిందన్నడంలో అతిశయోక్తి లేదు. మంచి కంటెంట్ ఉన్న కథను క్రియేటివ్గా చూపించ‌డంలో డైరెక్టర్ విజయ్ స‌క్సస్ అయ్యాడు. క్లైమాక్స్ ఫిస్ట్ ఎవరు ఊహించని విధంగా ఉండడంతో.. సినిమాకు ఇది మరింత ప్లస్ అయ్యింది. ఇక సుధీర్ మేనరిజం, స్వాగ్ కు ఆడియన్స్ ఫిదా అవుతారు. వరలక్ష్మి శరత్ కుమార్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరోసారి సినిమాలో తన మార్క్‌ నట్టున్నతో మెప్పించింది. లోకనాథ్ అజ్‌నీష్ సాంగ్స్ ఆడియన్స్‌ను పెద్దగా మెప్పించుకున్నా.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హ‌ఫ్ లోని కొన్ని సన్నివేశాలు, మ్యూజిక్.. క్లాస్ ప్రేక్షకులను మెప్పించడం కష్టమే. ఇది సినిమాకు మైనస్ అయ్యే అవకాశం ఉంది.

రేటింగ్ :3.0/5.0