తాజాగా ప్రముఖ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్ ఓ విడియోను రిలీజ్ చేశాడు. సినీ ప్రముఖుల భేటీ గురించి రియాక్ట్ అయ్యున ఆయన.. అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అరెస్టు వివాదం.. ఏ రేంజ్‌లో హాట్ టాపిక్ కి మారిందో తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఆయన పై మండిపడుతూ.. టాలీవుడ్ అందరికి బిగ్ షాక్ ఇచ్చాడు. ఇకపై ప్రీమియర్స్, టికెట్ ధరల పెంపులాంటి వాటికి పర్మిషన్లు ఇవ్వడం జరగదు అంటూ స్ట్రిక్ట్‌గా చెప్పేసాడు. ఇక తాజాగా సినీ ప్రముఖులంతా ముఖ్యమంత్రితో భేటీ అయిన సంగతి తెలిసిందే.
దీనిపై తమ్మరెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీ అంతా ముఖ్యమంత్రి దగ్గర తలవంచుకొని నిలబడాల్సిన అవసరం ఏమి వచ్చింది.. ఒక మనిషి కోసం ఆయన మర్డర్ చేశాడని నేను అనటం లేదు కానీ.. ఆయన వల్లే తప్పయితే జరిగింది. రోడ్ షో చేయడం వల్ల తెలియకుండా ఆయనే ఈ తప్పుకు బాధ్యుడయ్యాడు. తప్పు జరిగిన తర్వాత మళ్లీ దాన్ని కవర్ చేయడానికి ఎన్నో అబద్ధాలు ఆడాడు. దానివల్ల ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలంతా ముఖ్యమంత్రి ముందు తలవంచుకుని నుంచోవలసి వచ్చింది.
ఒక మనిషి కోసం అతను ఈగో కోసం.. మొత్తం ఇండస్ట్రీ అంతా తలవంచాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ ఓ వీడియో ద్వారా తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన కామెంట్స్ నెటింట వైరల్ అవ్వడంతో.. కొంతమంది ఆయనకు సపోర్ట్ గా మాట్లాడుతూ.. ఆయన చెప్పింది అక్షరాల నిజం.. కేవలం బన్నీ చేసిన తప్పుకు టాలీవుడ్ అంతా శిక్ష అనుభవిస్తుంది అంటూ కామెంట్లు చేస్తుంటే.. మరి కొంతమంది వారి స్వలాభాల కోసం.. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం కోసం సీఎంను కలిశారు.. అల్లు అర్జున్ కేసు గురించి వారేమీ సీఎంను కలవలేదు కదా.. అంటూ రియాక్ట్ అవుతున్నారు.