కూతురుగా నటించిన అమ్మాయితో హీరోయిన్‌గా చేసిన కృష్ణ.. ఆ లక్కీ లేడీ ఎవరంటే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసిన ఈయన.. స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. తన సినీ కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో హీరోగానే కాదు.. పలు సినిమాలకు ప్రొడ్యూసర్ గా.. ద‌ర్శ‌కుడిగాను చేసి తన సత్తా చాటుకున్నాడు. తన నటనతో లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్న కృష్ణ నటవరసుడిగా.. మహేష్ బాబు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

మా నాన్న నిర్దోషి - వికీపీడియా

ఇక అల్లూరి సీతారామరాజు అంటే ఇలానే ఉంటాడేమో.. ఆయన వీరత్వం అంటే ఇదేనేమో అనే అంతలా తన నటనతో సూపర్ స్టార్ కృష్ణ అల్లూరి సీతారామరాజు సినిమాలో మెప్పించాడు. మన్యం వీరుడు లాంటి ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ఈయన సినీ కెరీర్‌లో ఒక హీరోయిన్ కు మొదట తండ్రిగా నటించి.. మళ్లీ అదే హీరోయిన్ తో హీరోగా కలిసి చిందేశాడు. ఇంతకీ.. ఆమె ఎవరో కాదు అతిలోక సుందరి శ్రీదేవి. మొదట కృష్ణతో కలిసి శ్రీదేవి మా నాన్న నిర్దోషి సినిమాలో బాలనటిగా కనిపించింది.

Burripalem Bullodu Telugu Full Movie - Krishna, Sridevi - V9videos

ఆ తర్వాత విధి విలాసం అనే సినిమాలో మరోసారి కృష్ణ కూతురుగా ఆకట్టుకుంది. ఇక అదే శ్రీదేవి.. బుర్రపాలెం బుల్లోడు సినిమాలో కృష్ణతో కలిసి స్టెప్పులేసింది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి వాళ్ళ కెరీర్‌లోనే బెస్ట్ సినిమా గా నిలిచిపోయింది. అలా సూపర్ స్టార్ కృష్ణకు కూతురుగా నటించి.. మళ్లీ హీరోయిన్గా నటించిన ఏకైక హీరోయిన్గా శ్రీదేవి ఘ‌న‌త సాధించింది.