ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. ఎన్నో కష్టాలు, అవమానాలు తర్వాత సినిమాలతో వరుస సక్సెస్లను అందుకుంటూ మెగాస్టార్ రేంజ్‌కు ఎదిగాడు. అయితే ఆయన మెగాస్టార్ స్థాయికి ఎదగడానికి ఆయన భార్య సురేఖ కూడా ఎంతగానో తోడ్పడింది అంటూ ఎన్నో సార్లు చిరంజీవి స్వయంగా వెల్లడించాడు. సురేఖ సినీ ఇండస్ట్రీ ఉన్న ఫ్యామిలీ నుంచి.. చిరు ఇంటికి అడుగుపెట్టినా.. కుటుంబ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ భర్తకు, కుటుంబానికి అండగా నిలిచిందని.. ఎన్నోసార్లు మెగా ఫ్యామిలీకి వెల్లడించారు. అయితే తాజాగా సురేఖ మెట్టినిల్లే కాదు.. పుట్టింటి బాగోగులు చూసుకోవడం లో కూడా ఎప్పుడు ముందుంటారని.. వారికి కూడా అండగా నిలుస్తుందని నిరూపించుకుంది.
ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఇటీవల సురేఖ మేనల్లుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సమస్యలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లుడు కోసం ఒక కీలక నిర్ణయం తీసుకుందట సురేఖ. ఈ విషయం ప్రస్తుతం బయటకు రావడంతో అటు అల్లు ఫ్యామిలీతో పాటు, ఇటూ మెగా ఫ్యామిలి సురేఖ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. అల్లు అర్జున్, సురేఖకు పేరుకు మేనల్లుడు అయిన.. కొడుకు రామ్ చరణ్ కంటే బన్నీకే ఎక్కువగా సపోర్ట్ గా ఉంటారట. ప్రతి విషయంలోనూ బన్నీకి సపోర్ట్ చేస్తూ ఉంటుందట. అల్లుడికి కష్టం వస్తే.. తల్లి కంటే ఎక్కువగా బాధపడి పోతుందట.
అందుకే ఇప్పుడు తన మేనల్లుడు కష్టాల్లో ఉన్నాడని అల్లుడు కోసం, అండగా నిలిచేందుకు తన ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి త్వరగా బయటపడాలని ఒక మంచి డెసిషన్ తీసుకుందని.. ఆ భగవంతుని ప్రార్థిస్తూ 1000 మందికి అన్నదానం చేయాలని నిర్ణయించుకుందని తెలుస్తుంది. ముఖ్యంగా బన్నీ పేరు పై ప్రత్యేక పూజలు, అర్చనలు కూడా చేయిస్తుందట సురేఖ. ఈ కేసు నుంచి బన్నీ త్వరగా బయటపడాలని ప్రార్థనలు చేస్తున్నారని తెలుస్తుంది. ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో అల్లు కుటుంబానికి కూడా రాని ఆలోచన సురేఖ చేశారని.. ఆమె మంచి నిర్ణయం తీసుకున్నారని.. తను చేసిన పూజలకు ఫలితం దక్కాలని మెగా అభిమానులు, అల్లు అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.